అత్యంత పోషకాలు కలిగి ఉన్న డ్రై ఫ్రూట్ పిస్తా పప్పు (pistachio nut). దీనిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, క్యాల్షియం, ప్రోటీన్లు వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి. అలాగే బీటా కెరోటిన్, ఫైబర్, ఫాస్ఫరస్, ఫోలేట్, కాల్షియం, ఐరన్, థయమిన్, ప్రోటీన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, బి 6 అలాగే విటమిన్ కె కూడా ఉన్నాయి.
పిస్తా పప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ‘బెస్ట్ డైట్’ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పిస్తా పప్పులు తినడం వలన గుండెకు (Heart) చాలా మేలు చేస్తుంది. అలాగే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల గుండెజబ్బులు రాకుండా రక్షిస్తుంది.
కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పిస్తా పప్పులో అధికంగా ఉన్నాయి. ఇవి కంటి శుక్లాలు (Eyeballs) వంటి దీర్ఘకాలికంగా ఉండే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వయసు సంబంధిత మచ్చల నుండి రక్షించడంలో కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయి.
ఇవే కాకుండా పిస్తా పప్పు ను తినడం వలన ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పిస్తా పప్పు మెదడు ఆరోగ్యం గా ఉండడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ బి-6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడంలో తోడ్పడుతుంది.
వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వలన తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్దక (constipation) సమస్యను నివారించి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రీ బయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్ లోని మంచి బ్యాక్టీరియాని ఫీడ్ చేసి అజీర్తి మరియు గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి.
పిస్తా పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయి (Sugar level) ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటి నాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. కనుక మధుమేహంతో బాధపడే వారికి బెస్ట్ డైట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read : Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.
పిస్తా పప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది వయసు పెరిగే కొద్దీ చర్మాన్ని యవ్వనంగా (young) ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది. మగవారిలో అంగస్తంభన (erectile dysfunction) సమస్యలు ఉంటే వాటిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉండడం వలన పెద్ద ప్రేగు క్యాన్సర్ ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కాబట్టి పిస్తా పప్పులు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) శరీరానికి అందించవచ్చు. కనుక ప్రతిరోజు 10 పిస్తా పప్పులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటి ఖరీదు అధికంగా ఉన్నా, వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు 10 పిస్తా పప్పులను తినడం అలవాటు చేసుకోవాలి.