Telugu Mirror : ఐపీఎల్ 16 సీజన్లలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, డేల్ స్టెయిన్ వంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదు. గత 16 ఏళ్లుగా ఫ్రాంచైజీ, టీ20 లీగ్ టైటిల్ కోసం పోటీపడుతున్న బెంగళూరు క్లబ్ ఎట్టకేలకు మహిళల ప్రీమియర్ లీగ్‌లో తన చిరకాల లక్ష్యాన్ని సాకారం చేసుకుంది. WPL 2024 సీజన్ ఫైనల్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. WPL రెండవ సీజన్ ఫైనల్‌లో ఢిల్లీని చిత్తు చేసి, ఫ్రాంచైజీ (Franchise) మొదటి టైటిల్‌ను గెలుచుకున్న బెంగళూరు అద్భుతమైన ప్రదర్శన చేసింది.
Also Read : Virat Kohli : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మార్చి 17వ తేదీ ఆదివారం రాత్రి జరిగిన ఈ ఫైనల్‌లో ఇరు జట్లు తొలి టైటిల్ కోసం తలపడ్డాయి. టోర్నీలో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే బెంగళూరుకు ఇది తొలి ఛాంపియన్‌షిప్ మ్యాచ్. గతేడాది ఢిల్లీని ముంబై ఇండియన్స్ ఓడించగా, ఈసారి బెంగళూరు కిరీటాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు రికార్డు స్థాయిలో ఐదు అంతర్జాతీయ కప్ విజయాలను అందించిన వెటరన్ మెగ్ లానింగ్ (Meg Lanning), వరుసగా రెండోసారి ఫైనల్‌లో ఓడిపోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం అదిరినా..
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మునుపటి రెండు సీజన్లలో, రెండు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా, నాలుగింటిలో ఢిల్లీ గెలిచింది. టాస్ తర్వాత, కెప్టెన్ లానింగ్ మరియు షెఫాలీ వర్మ (Shefali Verma) తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. పవర్‌ప్లే సమయంలో వీరిద్దరూ కలిసి 61 పరుగులు చేశారు.
ముఖ్యంగా షెఫాలీ సిక్స్ ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఎడమచేతి వాటం స్పిన్నర్ సోఫీ మోలినో ఎనిమిదో ఓవర్‌లో వరుసగా షెఫాలీ, జెమీమా రోడ్రిగ్జ్ మరియు అలిస్ క్యాప్సీని అవుట్ చేసి ఢిల్లీ స్కోర్ కి బ్రేక్ లు వేసింది. ఆ తర్వాత RCB స్పిన్నర్లు ఢిల్లీని 113 పరుగులకు ఆల్ అవుట్ చేసారు.
Also Read : muthoot microfin New Branches 2024: మహిళలకు గుడ్ న్యూస్, ఏకంగా రూ.3 లక్షలు రుణాలు
బెంగళూరుకు ఇదేమీ కష్టమైన లక్ష్యం కాదు. సోఫీ డివైన్, కెప్టెన్ మంధాన జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డివైన్ (31) ఔటయ్యాక ఆర్సీబీ టైటిల్ విజయంలో బిగ్గెస్ట్ స్టార్ ఎల్లీస్ పెర్రీ క్రీజులోకి వచ్చింది. అయితే, మంధాన (32) వద్ద అవుట్ అయింది. ఆ తర్వాత, పెర్రీ మరియు రిచా ఘోష్ జట్టును గెలుపు దిశగా నడిపించారు.
వీరిద్దరూ కలిసి 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చివరి ఓవర్ వరకు పోటీ కొనసాగింది. రిచా లాస్ట్ ఓవర్ లో మూడో బంతికి ఫోర్ కొట్టి, జట్టును మొదటి ఛాంపియన్‌షిప్ అందుకునేలా చేసింది. రిచా నాటౌట్ 17 పరుగులు చేయగా, పెర్రీ 35 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు..
WPL 2024 అవార్డుల లిస్ట్ :
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…