Best Broadband Plans : మీకు ఇంటర్నెట్ కావాలా.. రూ.500 లోపు వచ్చే టాప్ ప్లాన్స్ ఇవే..!
మీకు రూ.500లోపు ఉండే మూడు మంచి ప్లాన్ల గురించి తెలియజేస్తాము.
Best Broadband Plans : మీరు ఇంట్లో కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే, కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఏ సంస్థ నుండి కొనుగోలు చేయాలో మీకు తెలియకపోవచ్చు. రూ.500లోపు మూడు మంచి ప్లాన్ల గురించి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.
జియో ఫైబర్ రూ. 399 ప్లాన్.
రిలయన్స్ జియో రూ. 399 ప్లాన్ దాని బ్రాడ్‌బ్యాండ్ సేవ నుంచి కొనుగోలు చేయగల అత్యంత సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా 30 ఎంబీపీఎస్ వేగం, 3.3టీబీ నెలవారీ డేటా, ఉచిత ఫిక్స్డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌తో వస్తుంది.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 499 ప్లాన్.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌కు సంబంధించిన రూ. 499 ప్లాన్ తో 40 ఎంబీపీఎస్ వేగం, 3.3 టీబీ డేటా, ఉచిత ఫిక్స్డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్, అపోలో 24×7 సర్కిల్, వింక్ మ్యూజిక్ ఉచితంగా వస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 399 ప్లాన్.
బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్‌కు సంబంధించిన రూ. 399 ప్లాన్ ద్వారా 30 ఎంబీపీఎస్ వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు 1 టీబీ నెలవారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు ఉచిత ఫిక్స్డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ సేవలను కూడా పొందవచ్చు.
కనెక్ట్ బ్రాడ్‌బ్యాండ్ రూ. 499 ప్లాన్.
కనెక్ట్ బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి రూ. 499 ప్లాన్ తో 50 ఎంబీపీఎస్ వేగం, 3.3 టీబీ నెలవారీ డేటాతో వస్తుంది. కనెక్ట్ బ్రాడ్‌బ్యాండ్ అందించే ఉచిత ఫిక్స్డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా మనం పొందవచ్చు.
అలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ రూ. 425 ప్లాన్.
కోల్‌కతాకు చెందిన అలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ దాని రూ. 425 ప్లాన్‌పై అపరిమిత డేటా, 40 ఎంబీపీఎస్ వేగంతో అందిస్తుంది. హంగామా ప్లే, లైవ్ టీవీకి సబ్స్క్రిప్షన్లతో అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఉచిత ఫిక్స్డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ వంటివి ఏవీ అందించడం లేదు.
Best Broadband Plans
Also Read : Vivo Y58 5G Smartphone : వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.
Comments are closed.