Telugu Mirror: క్యాల్షియం(calcium) ఎముకలకు దంతాలకు మాత్రమే అవసరం అని చాలామంది అనుకుంటారు .కానీ శరీరానికి కూడా కాల్షియం అవసరమని చాలా మందికి తెలియదు .ఇంట్లో మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పాలు తాగమని పదేపదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే పాలల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది .ఎదిగే పిల్లలకు క్యాల్షియం అవసరం. క్యాల్షియం ,పాలు మరియు పాలకు సంబంధించిన పదార్థాలలో ఎక్కువగా లభ్యమవుతుంది .ఎముకలు మరియు దంతాలను బలంగా చేయడానికి క్యాల్షియం దోహదపడుతుంది. శరీరంలో క్యాల్షియం తక్కువ అయితే ఎముకలు బలహీనంగా మారుతాయి.
మనం తీసుకునే రోజువారి ఆహారంలో క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. క్యాల్షియం పాలలోనే కాకుండా ఇంకా ఏయే పదార్థాలలో ఉంటుందో తెలుసుకుందాం.
Also Read:Skin Tips:ఫేస్ ప్యాక్ లే కాదు ఇంటి చిట్కాలు కూడా ప్రకాశించే చర్మ సౌందర్యాన్ని ఇస్తాయి
శరీరంలో అనేక అవయవాల ప్రాథమిక పనితీరు లో క్యాల్షియం తన పాత్ర పోషిస్తుంది. ఇది దంతాలకు ,ఎముకలకు(bones) మాత్రమే కాదు శరీరంలోని రక్తప్రసరణను(blood circulation) పెంపొందించడంలో మరియు కండరాల పనితీరును సరిగ్గా నిర్వహించడంలో అలాగే మెదడు నుండి శరీరంలోని ఇతర అవయవాలకు సంకేతాలను పంపడంలో కూడా దోహదపడుతుంది .ఎముకలు ఉక్కులాగా ఉండటానికి, అలాగే వాటి యొక్క సాంద్రతను బలంగాఉంచుకోవడానికి క్యాల్షియం చాలా అవసరం.
క్యాల్షియం లోపం ఉన్న వారికి ఎముకలు ,దంతాలు చాలా బలహీనంగా ఉంటాయి .మరియు కీళ్ళకు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
Also Read:Garlic Uses : రోజువారీ ఆహారంలో వెల్లుల్లి ప్రయోజనాలు.. తెలిస్తే వదిలి పెట్టరు..
మన శరీరంలో క్యాల్షియం తయారు అవ్వదు:
శరీరం క్యాల్షియంను ఉత్పత్తి చేయదు. కాబట్టి మనం ఆహారం ద్వారా శరీరానికి క్యాల్షియంను అందించాలి .క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి .అవి ఏమనగా పాలు ,చీజ్ మరియు పెరుగు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ,తృణధాన్యాలు, సోయా ఉత్పత్తుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి రోజువారి ఆహారంలో ఇటువంటి ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
సూర్య రశ్మి ద్వారా విటమిన్-D ని ఎలా పొందాలి:
మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియం ఉన్నప్పటికీ, మన శరీరంలో విటమిన్ -డి లోపం ఉన్నట్లయితే కాల్షియంతో ఉన్న ఆహారం సరిపోదు. దీనికి తోడుగా విటమిన్ -డి ని తీసుకోవాలి. అప్పుడు ఎముకలు బలంగా ఉంటాయి. సూర్యకాంతి ద్వారా విటమిన్ -డి లభిస్తుంది. కావున ఉదయం ఎండ తగిలే ప్రదేశంలో ఉండాలి .దీని ద్వారా విటమిన్- డి శరీరానికి లభిస్తుంది.
అధిక మోతాదులో క్యాల్షియం హానికరం:
ఎక్కువ మోతాదులో క్యాల్షియం తీసుకోకూడదు. ఎందుకంటే చెడు ఫలితాలు ఉంటాయి. అనగా గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది .శరీరంలో క్యాల్షియం ఎక్కువైతే మూత్రపిండాల్లో రాళ్లను కూడా పెంచేలా చేస్తుంది.
అందువలన క్యాల్షియంను శరీరానికి తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.