మహిళల ఇంటి పనులు సులభతరం చేసేందుకు చౌకగా దొరికే ఈ గృహోపకరణాలు పొందండిలా
ఇంటి పనులు తొందరగా పూర్తి చేసి ఉద్యోగాలు చేసుకునే ఆడవారు ఆలస్యం లేకుండా తక్కువ ధర తో కూడిన ఈ వస్తువులను కొనుగోలు చేసుకోండి. మీ పనిని సులభతరం చేసుకోండి.
Telugu Mirror : ప్రస్తుత కాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు (Jobs) మరియు వ్యాపారాలు చేస్తున్నారు. వారు ఇంట్లో పనులు త్వరగా పూర్తి చేసుకొని ఉద్యోగానికి వెళ్ళాలి. కాబట్టి పనులు త్వరగా అయిపోవాలి. అటువంటి పరిస్థితులలో వీరు కొన్ని రకాల గృహపకరణాలు (HouseHold Appliances) తీసుకోవడం వలన పనులు సులభతరం అవుతాయి. సమయం కూడా ఆదా అవుతుంది. ఈ గృహోపకరణాలు తక్కువ బడ్జెట్ లోనే అందుబాటులో ఉన్నాయి. ఈరోజుల్లో మార్కెట్లో ఇటువంటివి తక్కువ ధరల్లో లభించే పరికరాలు చాలా ఉన్నాయి. వీటిని వాడడం ద్వారా పనిని సులభతరం చేసుకోవచ్చు. ఈ వస్తువులు వెయ్యి రూపాయల లోపు అందుబాటులో ఉన్నాయి . ఇవి తక్కువ బడ్జెట్లో(Low Budget) లభించడం వల్ల అందరూ కొనుక్కోవచ్చు. ఆ పరికరాలు ఏమిటో చూద్దాం.
USB ట్రావెల్ అడాప్టర్ :
మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఫోన్ లేదా లాప్ టాప్ బ్యాటరీ (Laptop Battery) అయిపోతుంది. అటువంటి సందర్భంలో యుఎస్బీ ట్రావెల్ అడాప్టర్ (USB travel adopter) కొనుగోలు చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రయాణంలో ఉండే వారికి ఉపయోగపడే ఒక గొప్ప పరికరం. దీనిని మీరు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. దీని ధర సుమారుగా 500 రూపాయలు ఉంటుంది.
ఎలక్ట్రిక్ మినీ చాపర్ :
ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు మరియు మీరు అలసిపోయి ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీనితో కూరగాయలు (Vegetables) కట్ చేసుకోవచ్చు. దీనిని వాడటం వలన మీ పని త్వరగా మరియు సులువుగా అవుతుంది. దీనితో అన్ని రకాల కూరగాయలను తేలికగా కట్ చేసుకోవచ్చు. మరియు అల్లం వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవచ్చు .దీని ధర దాదాపుగా 900 రూపాయలు ఉంటుంది.
మొబైల్ టేబుల్ టాప్ హోల్డర్ :
పనిచేసే సమయంలో ఫోన్ మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. అలాగే చేతులు కూడా తడిగా ఉంటాయి. మొబైల్ ను తడిచేతులతోనే పట్టుకోవడం వల్ల ఫోన్ పాడవుతుంది. కనుక మొబైల్ టేబుల్ టాప్ హోల్డర్ (mobile table top holder) ను వాడటం బెస్ట్ సెలక్షన్. దీని వలన మీరు ఏ పనిలో ఉన్న హ్యాపీగా ఫోన్ మాట్లాడుకోవచ్చు. దీని ఖరీదు 150 నుండి 600 రూపాయల వరకు ఉంటుంది.
కోకోనట్ డ్రిల్ కట్టర్ :
చాలామంది ఇంటిదగ్గర కొబ్బరి చెట్లను పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే కొబ్బరి బోండం నుంచి నీరు తీయాలంటే, దాన్ని కట్ చేయడం అందరికీ రాదు. కోకోనట్ డ్రిల్ కట్టర్ (coconut drill cutter) ను ఉపయోగించి సులువుగా కొబ్బరి బొండం నీళ్లు తీయవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన వస్తువు. దీని ధర కూడా చాలా తక్కువ. మార్కెట్లో 100 రూపాయలకు లభిస్తుంది.
మాక్ టైల్ లేదా కాఫీ ఫోమర్ :
స్మూత్ మరియు క్రీమ్ కాఫీ (Cream Coffee) ని తరచుగా ఇంట్లో తయారు చేయడం కష్టం. ఎందుకంటే ఈ కాఫీ ని తయారు చేయాలంటే చేతితో బాగా ఊపాలి. కాబట్టి కాఫీ ఫోమర్ ను ఉపయోగించి సులభంగా తయారు చేసుకోవచ్చు.దీని ద్వారా కాఫీ కి మృదువైన రూపాన్ని మరియు గొప్ప రుచిని అందిస్తుంది. దీని ఖరీదు 200 రూపాయల నుండి 600 రూపాయలు వరకు ఉంటుంది.
మినీ ఆర్మీ టూల్ కిట్ :
ముడతలు పోయి ముత్యంలాంటి మెరిసే చర్మానికి చక్కటి ఇంటి చిట్కాలు మీ కోసం.
మీరు విహారయాత్రలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు మినీ ఆర్మీ టూల్ కిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కత్తి, స్క్రూ డ్రైవర్ ,టార్చ్ లైట్ మరియు కీచైన్ (Key Chain) తో కూడిన సదుపాయం ఉన్న టూల్ ఇది. మినీ ఆర్మీ టూల్ కిట్ మనకు అన్ని సౌకర్యాలను ఒకేసారి అందిస్తుంది. దీని ధర 300 నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. దీనిని బహుమతిగా కూడా ఇచ్చుకోవచ్చు.
ఫ్యాన్ క్లీనింగ్ మాప్ :
సాధారణంగా ఫ్యాన్ క్లీన్ చేయడం కష్టం మరియు బోరింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే అది ఎత్తు లో ఉంటుంది.కాబట్టి ఈ సమస్య నుంచి బయట పడాలంటే మీరు ఫ్యాన్ క్లీనింగ్ మాప్ ని ఉపయోగించవచ్చు. దీనిని వాడటం కూడా చాలా సులభం. దీని ఖరీదు 250 నుంచి మొదలవుతుంది.
పాకెట్(Pocket) ఫ్లాష్ లైట్ :
ఒకప్పుడు రాత్రిపూట బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు టార్చ్ లైట్ తీసుకుని వెళ్లేవారు .కానీ ఇప్పుడు టార్చ్ తీసుకెళ్లడానికి కొందరు ఇష్టపడడం లేదు. అటువంటి వారికి ఇది బెస్ట్ ఎంపిక . పాకెట్ ఫ్లాష్ లైట్ చాలా బాగా సహాయపడుతుంది. దీనిని షర్టు లేదా ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోవచ్చు. దీని ఖరీదు 600 రూపాయలు నుంచి మొదలవుతుంది.
కాబట్టి ఇటువంటి కొన్ని పరికరాలు ఉండటం వలన మనకు చాలా బాగా సహాయపడతాయి.