యాపిల్ ప్రియులకు మంచి శుభవార్త యాపిల్ ఐఫోన్ 14 సీరీస్ పైన భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అతి పెద్ద ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ లో యాపిల్ 14 సీరీస్ పైన పెద్ద డిస్కౌంట్ అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 14 సీరీస్ పోయిన సంవత్సరంలో యాపిల్ విడుదల చేసింది. అయితే తాజాగా అమెజాన్ యాపిల్ ఐఫోన్ 14 సీరీస్ మీద ఎక్కువ డిస్కౌంట్ తీసుకొచ్చింది. మొన్నటి దాకా అమెజాన్ ఐఫోన్ 13 పైన మంచి డిస్కౌంట్ ను అందజేసింది, అలానే ఇప్పుడు కూడా ఐఫోన్ 14 సీరీస్ పైన డిస్కౌంట్ లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 14, 128GB స్టోరేజ్ మోడల్ మీద అమెజాన్ 16 శాతం డిస్కౌంట్ ను అందజేస్తుంది, దాంతో రూ.79,999 వుండ వలసిన ఐఫోన్ 14 రూ.66,999 కే లభిస్తుంది. 256GB వేరియంట్ మీద రూ.10,901 తగ్గింపు లభిస్తుంది అంటే 12 శాతం డిస్కౌంట్ లభిస్తుంది, కాబట్టి ఈ ఫోన్ రూ.78,999 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్, 128GB మోడల్ పైన 15 శాతం భారీ డిస్కౌంట్ లభిస్తుంది దాంతో ఈ ఫోన్ ని మనం రూ.89,900 పొందాల్సింది రూ.75,999 కే పొందవచ్చు. 256GB మోడల్ పైన 14శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది దాంతో రూ.99,900 మీద రూ.13,901 తగ్గి రూ.85,999 ఐఫోన్ 14 ప్లస్ లభిస్తుంది.
Bank Holidays in July: 15 రోజులు బ్యాంకులు బంద్.. లిస్ట్ ఇదే..
ఐఫోన్ 14 మరియు 14 ప్లస్ ఫోన్ లు రెడ్, యెల్లో, బ్లూ, మిడ్ నైట్, పర్పుల్ మరియు స్టార్ లైట్ కలర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.ఐఫోన్ 14 ప్రో మనకు 128GB, 256GB మరియు 512GB ఇలా మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ముందుగా 128GB వేరియంట్ యొక్క ధరను చూసినట్లయితే 8 శాతం డిస్కౌంట్ తో రూ.1,19,999 లకు లభిస్తుంది. 256GB మోడల్ 7 శాతం డిస్కౌంట్ తో రూ.9,901 తగ్గి మనకు రూ.1,29,999 లభిస్తుంది. మరియు 512GB స్టోరేజ్ మోడల్ రూ.1,59,900 ఉండవలసింది 6 శాతం డిస్కౌంట్ తో రూ.1,49,999 కే మనం దీన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్ గోల్డ్, స్పేస్ బ్లాక్, సిల్వర్ మరియు డీప్ పర్పుల్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి.హై ఎండ్ వెర్షన్ ఐఫోన్ 14 ప్రోమాక్స్ కూడా 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ కూడా స్పేస్ బ్లాక్, గోల్డ్, సిల్వర్ మరియు డీప్ పర్పుల్ ఇలా నాలుగు కలర్స్ లో లభిస్తుంది. 128GB మోడల్ పైన 9 శాతం డిస్కౌంట్ ను మనం పొందవచ్చు, దాంతో రూ.1,27,999 కు మనం దీన్ని కొనవచ్చు. 256GB స్పేస్ బ్లాక్ మరియు డీప్ పర్పుల్ కలర్స్ మీద 8 శాతం డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి మనం రూ.1,49,900 ఉన్న ఫోన్ ను రూ.1,37,999 కే సొంతం చేసుకోవచ్చు.
Telugu panchangam Today: నేటి పంచాంగం… 2 జూలై 2023 వివరాలు ఇవే…
గోల్డ్ మరియు సిల్వర్ కలర్స్ పైన డిస్కౌంట్ కొంచెం తగ్గుతుంది, ఈ కలర్ ఆప్షన్ తో 4 శాతం డిస్కౌంట్ మాత్రమే అందుబాటులో ఉంది, దాంతో రూ.5,910 తగ్గి రూ.1,49,900 ఉండాల్సింది రూ.1,43,990 కు ఐఫోన్ 14 ప్రో మాక్స్ లభిస్తుంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ 512GB స్టోరేజ్ వేరియంట్ పైన ఎటువంటి డిస్కౌంట్ లేదు. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో మాక్స్ గోల్డ్ కలర్ మరియు అది ఒక్కటే స్టాక్ లో ఉంది, దీని ధర రూ.1,69,900. మరి ఏ ఫోన్ ను కొనాలో ఆలోచించండి, త్వరలో ఐఫోన్ 15 సీరీస్ రాబోతుంది. ఐఫోన్ 15 సీరీస్ ఎప్పటి ఐఫోన్ లలా కాకుండా అప్ గ్రేడ్ అయ్యి వస్తుందని సమాచారం. కానీ మీరు ఐఫోన్ 14 నే కొనాలనుకుంటే ఐఫోన్ 14 ప్లస్ లేదా ఐఫోన్ 14 ప్రో మాక్స్ 128GB మోడల్స్ ను తీసుకోవడం ఉత్తమం.