Telugu Mirror : మీరు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిలో బిజీ అయితే కాఫీ రిలాక్సేషన్ ని ఇస్తుంది. కాఫీని మనం ఏ విధంగా తాగిన కూడా రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. అదనంగా, మనలో చాలామంది ఉదయాన్నే కాఫీ లేకుండా రోజు గడపడానికి కష్టపడుతుంటారు. కాఫీ మనల్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది, అయితే కాఫీ బరువు తగ్గడంలో సహాయపడుతుందని మీకు తెలుసా? అవును కాఫీ తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. చక్కెర లేకుండా కాఫీ తాగడం వల్ల దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టడీస్ ప్రకారం రోజూ నాలుగు కప్పుల కాఫీ మన శరీర కొవ్వును 4% తగ్గిస్తుంది.
బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
1. బ్లాక్ కాఫీలో ఉండే కేలరీలు:
USDA ప్రకారం, గ్రౌండ్ బీన్స్ నుండి తయారైన రెగ్యులర్ బ్లాక్ కాఫీలో ఒక కప్పుకు రెండు కేలరీలు ఉంటాయి. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో న్యూరో ట్రాన్స్‌మిటర్‌లను (Transmitters) ప్రేరేపించి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు సహాయపడుతుంది.
2. బ్లాక్ కాఫీ లో ఉండే సౌకర్యాలు :
బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ (Chlorogenic) యాసిడ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్లోరోజెనిక్ యాసిడ్ కారణంగా బ్లాక్ కాఫీ(Black coffee) రాత్రి భోజనం తర్వాత గ్లూకోజ్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనితో పాటు కొత్త కొవ్వు కణాల ఉత్పత్తి నెమ్మది చేస్తుంది. శరీర కేలరీలను తగ్గిస్తుంది. ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సిమ్రాన్ సైనీ మాట్లాడుతూ, “కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచేందుకు, బరువు తగ్గడానికి మరియు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచేందుకు దోహదపడుతుంది.”
3. బ్లాక్ కాఫీ ఆకలిని తగ్గిస్తుంది :
కాఫీలోని ఒక భాగం కెఫిన్, (Caffeine) మన శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. కెఫీన్ సహజంగా మెదడు చురుకుదనాన్నిపెంచుతుంది. ఇది శక్తిని కూడా పెంచుతుంది.
4. కొవ్వును కరిగించే సామర్థ్యం :
గ్రీన్ కాఫీ గింజలు కొవ్వును (Fat) కరిగిస్తాయి. ఇది ఫ్యాట్ బర్న్ ఎంజైమ్‌లను పెంచుతుంది. ఇది సహజంగా కాలేయాన్ని కూడా శుభ్రపరచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది మీ శరీరం యొక్క జీవక్రియను మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
5. శరీరంలోని అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది :
బ్లాక్ కాఫీ శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. ఎలాంటి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బరువు తగ్గడంలో ఇది సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి, మీ బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ సహాయపడుతుంది.
గమనిక : బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీ డైట్‌లో కొత్తగా ఏదైనా చేర్చుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.