శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే అనేక రకాల అంటువ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఫ్లూ(Flu) వంటి ఇన్ఫెక్షన్(Infection) సోకిన లేదా కోవిడ్ (Covid)వంటి తీవ్రమైన సమస్య ఉన్న, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బలమైన రోగ నిరోధక వ్యవస్థ చాలా అవసరమని వైద్యులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ.
రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీంతో పాటు వ్యాయామం (exercise) చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్- సి ఉన్న ఆహారాన్ని (Food) మాత్రమే అధికంగా తీసుకుంటే సరిపోదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక వ్యవస్థని పెంపొందించడానికి ఆహారం (Food) ద్వారా విటమిన్లు, ప్రోటీన్లు మరియు ఇతర రకాల పోషకాలను కూడా తీసుకోవడం చాలా అవసరం. రోగ నిరోధక శక్తి పెంచడానికి విటమిన్ -సి కాకుండా ఇంకా ఏ ఇతర పోషకాలు అవసరమో తెలుసుకుందాం.
విటమిన్- C :
రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమయ్యే పోషకాలలో విటమిన్ -సి ఒకటిగా చెప్పబడుతుంది. ఫ్లూ సోకినప్పుడు ఆ ప్రాంతంలో విటమిన్- సి న్యూట్రో ఫిల్స్ (Neutro Phils) ను ప్రేరేపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది వ్యాధికారక క్రిములతో పోరాడడానికి చాలా బాగా సహాయపడుతుంది. సూక్ష్మజీవులను (Bacteria) నాశనం చేసి వ్యాధి లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా దోహదపడుతుంది. ఇదే కాకుండా బలమైన రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో కూడా తోడ్పడుతుంది.
జింక్:
శరీరంలోని కణాలలో జింక్ (Zink)ఉంటుంది. ఇది కూడా రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి తోడ్పడుతుంది. వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడటానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో డిఎన్ఎ (DNA)(కణాలలో జన్యుపదార్థం) ప్రోటీన్లను తయారు చేయడానికి జింక్ ను కూడా ఉపయోగించుకుంటాయి. ప్రతి ఒక్కరు ఆహారం (Food) ద్వారా జింక్ తినాలని వైద్యులు సూచించారు. ఇది కఠినమైన వ్యాధుల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
విటమిన్- D:
కండరాలు (Muscles) మరియు ఎముకలు (Bones) అలాగే నరాల (nerve) పనితీరుకి విటమిన్ -డి చాలా ముఖ్యం. ఇది రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడడానికి తోడ్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. విటమిన్ -డి ని ఆహారం ద్వారా సులభంగా పొందవచ్చు. బాదం, అనేక రకాల గింజలు(Nuts), పాల ఉత్పత్తులు మరియు పండ్లలో విటమిన్- డి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.
Also Read :అరటి పండ్లు కూడా కొన్ని సార్లు అనారోగ్యానికి గురిచేస్తాయి, మరి ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకోండి.
చక్కెర ఇక చాలు బెల్లమే ఆరోగ్యానికి చాలా మేలు
Eating Too much Sweets : అధికంగా తీపి పదార్ధాలు తింటున్నారా? అయితే ఈ చేదు నిజాలు మీ కోసమే.
విటమిన్- E:
రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి విటమిన్ -ఇ కూడా అవసరం. విటమిన్ -ఇ అనేది శరీరంలో శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్ . ఇది రోగ నిరోధక వ్యవస్థ సంక్రమణతో పోరాడుతుంది. రక్తనాళాలను విస్తరించడం మరియు అవి గడ్డ కట్టకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. చర్మం(Skin) మరియు జుట్టు (Hair)ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ -ఇ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం.
కాబట్టి బలమైన రోగనిరోధక శక్తి అందరికి అవసరం. కనుక ప్రతి ఒక్కరు ఆహారంలో విటమిన్- C, విటమిన్- E, విటమిన్ -D మరియు జింక్ (Zink)ఉన్నఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి