Telugu Mirror : కొంతమంది మహిళలు ఆఫీస్ కి లేదా బయటికి వెళ్లాలనుకున్నా కొంచెం అయినా మేకప్(Make Up) లేనిదే బయటికి వెళ్లరు. కొంతమందికి ప్రతిరోజు లైట్ మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది. మేకప్ వేసుకోవడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అందంగా కనిపించాలని.
Horoscope july 23: నేటి రాశి ఫలాలు మీ కోసం
కళ్ళకు కాటుక మరియు ఐ లైనర్ అప్లై చేసుకుంటూ ఉంటారు. కానీ కళ్ళకు మేకప్ సరిగ్గా వేయకపోతే మీ లుక్ మొత్తం చెడిపోయే అవకాశం ఉంది. కొంతమంది కళ్ళు చిన్నవిగా ఉంటాయి. వారు థిక్ గా కాజల్ మరియు ఐ లైనర్(Eye liner) ను అప్లై చేస్తారు. అలా చేయడం వల్ల కళ్ళు అందంగా కనిపించటానికి బదులుగా విచిత్రంగా కనిపిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే చిన్న కళ్ళు ఉన్న మహిళలు ఎలాంటి మేకప్ టిప్స్(Make Up Tips) అనుసరించాలో తెలుసు కుందాం.
ఐ లైనర్:
చిన్న కళ్ళు ఉన్నవారు మందపాటి ఐ లైనర్ వాడకూడదు. చాలా మంది మందపాటి ఐ లైనర్ వాడటం వల్ల కళ్ళు పెద్దగా కనిపిస్తాయి అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అలా చేయకూడదు అలా చేయడం వల్ల మీ లుక్(Look) మొత్తం చెడిపోయే అవకాశం ఉంది.చిన్న కళ్ళు ఉన్నవారు కళ్ళు అందంగా కనిపించాలంటే రెక్కల ఐలైనర్ ని ఉపయోగించాలి. మీరు ధరించిన దుస్తులను బట్టి మీరు రెక్కల ఐలైనర్ ని అప్లై చేయాలి.
కాజల్:
కాజల్(Kajal) కళ్ళకి మందంగా పెట్టుకోవడం వల్ల మీ కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి అనుకుంటారు. అలా చేయడంలో మీ కళ్ళు వింతగాకనిపిస్తాయి.చిన్న కళ్ళు ఉన్నవారు కాజల్ ని వాటర్ లైన్(Water Line) లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
Xiaomi A Series: లేటెస్ట్ షావోమీ స్మార్ట్ టీవీ.ఫ్రీ గా చానల్స్ చూడవచ్చు
మస్కార:
కళ్ళు మరింత అందంగా కనిపించాలంటే మస్కార(Mascara) వాడాల్సిందే. చిన్న కళ్ళు ఉన్న మహిళలు మస్కారాని తక్కువ మోతాదులో మాత్రమే అప్లై చేయాలి. మస్కారా ని ఎక్కువసార్లు వేయకూడదు. ఇలా చేయడం వలన మీ లుక్ మొత్తం చెడిపోతుంది.మీరు కళ్ళకు మేకప్ చేసేముందు ఐబేస్ అప్లై చేయాలి. ముందుగా దీన్ని అప్లై చేయడం ద్వారా మీ కళ్ళు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరియు ఇలా చేయడం వల్ల మీ మేకప్ చాలా హైలైట్(Highlight) గా మారుతుంది.చిన్న కళ్ళు ఉన్నవారు ఇటువంటి కొన్ని టిప్స్(Tips) ఫాలో అవ్వడం ద్వారా మీ కళ్ళను ఆకర్షణీయంగా ,అందంగా చేసుకోవచ్చు.