క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవడం వలన బరువు అదుపు (control) లో ఉండడమే కాకుండా రోజంతా శక్తి (energy) ని ఇస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
Also Read : Beauty Tip : ఆహారం లో ఈ పదార్ధాలను తీసుకోండి, సన్ స్క్రీన్ రాయకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.
రోజువారి ఆహారంలో ఆరోగ్యకరమైన మరియు ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన బరువును నియంత్రణలో ఉంచడంతో పాటు, రోజంతా ఉత్సాహంగా రిఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడతాయి.
క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
రాగులు :
రాగుల లో క్యాల్షియం మరియు ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. రాగుల లో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం శరీరంలో వేడిని తగ్గించడంతోపాటు, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయ పడతాయి. రాగులతో ఇడ్లీ, చపాతి, దోశ, జావ వంటివి తయారు చేసుకుని తినడం వలన శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించినట్లే.
శనగలు :
శనగల లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ మరియు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి వేయించిన శనగలు (Peas) చాలా బాగా సహాయపడతాయి. జలుబు, జ్వరం, దగ్గు ఉన్నవాళ్లు వేయించిన శనగలు తింటే చక్కటి ఉపశమనం లభిస్తుంది.
సూప్ లు :
వెజిటేబుల్ సూప్ మరియు లెంటిల్ సూప్ వంటి ఆరోగ్యకరమైన సూప్ లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ మరియు శరీరానికి అవసరమైన పోషకాలు (Nutrients) ఎక్కువగా ఉంటాయి. వీటిని త్రాగడం వలన ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది .తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
నట్స్:
వాల్ నట్, బాదం, పిస్తా లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధి (intensity) గా ఉంటాయి. వీటిని తీసుకుంటూనే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన బరువును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
మొలకెత్తిన ధాన్యాలు :
చిరు తిండి లో మొలకెత్తిన ధాన్యాలు ఒకటి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. మొలకెత్తిన ధాన్యాలలో ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్ విటమిన్ సి కె ,మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు ఉండటం వలన ఆరోగ్యాన్ని రక్షించడంలో చాలా బాగా ఉపయోగపడుతాయి.
మొలకెత్తిన గింజలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. బరువును నియంత్రణలో ఉంచాలి అనుకునే వారికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను మరియు డీప్ ఫ్రై ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం వలన బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా రోజంతా ఉత్తేజంగా ఉంటారు.
Also Read : Health Tips : ఫ్రిడ్జ్ లో ఇవి నిలువ చేసి వాడుతున్నారా? అయితే మీరు శరీరంలోకి విషాన్ని పంపిస్తున్నట్లే.
కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు అలాగే రోజంతా చలాకీగా, చురుకుగా (active) ఉండాలి అనుకునేవారు, మరియు శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి, క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఇటువంటి ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. తద్వారా ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించవచ్చు.