Telugu Mirror : తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.హైదరా బాద్ సహా రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో తేలిక పాటి వర్షాల నుండి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి.అయితే తాజాగా మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రాష్ట్రంలో 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు శుక్రవారం , జూలై 21, 2023 తిథి ,పంచాంగం
ఒడిస్సా కు ఆనుకుని జార్ఖండ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈరోజు,రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.రాష్ట్రం లోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపధ్యంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవ్వాలని ఐఎండీ సూచించింది.ఐఎండీ ప్రకటన ప్రకారం రాష్ట్రంలో మహబూబా బాద్,వరంగల్,హన్మకొండ, ఖమ్మం,జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే సిద్దిపేట,వికారాబాద్, జనగాం,పెద్దపల్లి,నిజామాబాద్,జగిత్యాల,ములుగు,జయశంకర్ భూపాలపల్లి,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 5 కుమురం భీం, అదిలాబాద్,నిర్మల్,మంచిర్యాల,కరీంనగర్,రాజన్నసిరిసిల్ల,మెదక్,మేడ్చల్,
మల్కాజ్ గిరి,సంగారెడ్డి,రంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురవ నున్న.మరోవైపు గోదావరి లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ,భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకుంది.ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు.
Healthy Fat: శరీరానికి అవసరమైన కోవు ఎలా తయారు అవుతుంది దాని ఒక ఉపయోగాలు మీకు తెలుసా
ఇదిలావుండగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా GHMC పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈరోజు,రేపు (శుక్ర,శని వారాలు) రెండు రోజులు C.M..K.C.R. సెలవులు ప్రకటించారు.వైద్యం,పాల సరఫరా తదితర అత్యవసర సేవలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం K.C.R.తెలిపారు.అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను CM ఆదేశించారు.కాగా భారీ వర్షాలు కారణంగా రాష్ట్ర వ్యాపితంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు గురు,శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.