Face Pack : మెరిసే చర్మం కోసం నాచురల్ పేస్ ప్యాక్ ..ఇప్పుడు మీ కోసం..

Telugu Mirror : వాతావరణం లో పెరుగుతున్న కాలుష్యం(Pollution) ,రసాయనాలతో కూడిన ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి ఇవి మానవ శరీరంపై ప్రభావం చూపుతున్నాయి .చర్మ సంబంధిత సమస్యలు మరియు జుట్టు ఊడిపోవడం సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.మీ ముఖం కాంతి హీనంగా ఉంటే మరియు ముఖంపై మచ్చలు, ముడతలు ఉన్నట్లయితే ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్(Face Pack). ఈ ప్యాక్ తరచుగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత బిజీ లైఫ్(Busy Life) లో బ్యూటీ పార్లర్ కి వెళ్లే సమయం దొరకడం కష్టం. పార్లర్(Parlor) కు వెళ్లి డబ్బు మరియు సమయం వృధా అవ్వకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కేవలం రెండే రెండు పదార్థాలు అవసరం.

World Brain Day 2023: మీ మెదడును ప్రమాదకరమైన వ్యాధుల నుంచి నివారించాలనుకుంటున్నారా?

ఫేస్ ప్యాక్ కు కావలసిన పదార్థాలు:

Image Credit : Vanitha

తేనె: తేనె(Honey)లో తేమ లక్షణాలు ఉన్నాయి. తేనెను చర్మంపై అప్లై చేయడం వలన చర్మంలో తేమ అలానే ఉంటుంది.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్(Lactic Acid) ఉంటుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ మరియు విటమిన్ లు ఉన్నాయి. ఇవి చర్మం పైన ఉన్న మచ్చలను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. తేనే మరియు పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత మంచి నీటితో ముఖాన్ని కడగాలి .దీనిని తరచుగా చేయడం వల్ల చర్మ సంబంధిత ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.ముఖం కాంతివంతంగా మారుతుంది. వాతావరణం లో వేడి కారణంగా మీ ముఖంపై మొటిమలు వచ్చినట్లయితే ఈ ప్యాక్ ఉపయోగించడం వలన మచ్చలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది.

Vivo Y27 : అదిరిపోయే ఫీచర్స్ తో అందరికి అందుబాటులో Vivo Y27 4G ఫోన్ ..

ఈ ప్యాక్ ను తరచుగా ఉపయోగించడం వలన చర్మం లోపల కొల్లాజెన్(Collagen) ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా ముఖంపై ఉన్న ముడతలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.ఎండ వల్ల ముఖంపై కమిలిపోయి మరియు నల్లగా ఉన్నట్లయితే ఈ ప్యాక్ ను వాడటం వల్ల నలుపు తగ్గిపోతుంది. ఎండ వల్ల వచ్చే టాన్ కూడా తగ్గుతుంది .ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ ఎలర్జీ(Skin Allergy) లను తగ్గించడం లో బాగా పనిచేస్తుంది. చర్మం యొక్క పీహెచ్ స్థాయిని సమానంగా ఉంచుతుంది.బ్యూటీ పార్లర్ కు వెళ్లి సమయము మరియు డబ్బు వృధా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాక్ ను వాడినట్లయితే మీ ముఖం పై ఉన్న మొటిమలు, మచ్చలు ,దురదలు అన్నీ సులువుగా తొలగిపోతాయి.

గమనిక : చర్మ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లయితే మీ వైద్యుడుని సంప్రదించి సలహా తీసుకోగలరు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in