Telugu Mirror : పోస్ట్ ఆఫీస్ పథకాలు పొదుపరులకు మంచి రాబడిని అందించడమే కాకుండా సులభంగా, సురక్షితమైనవిగా ఉంటాయి. పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా మంచివిగా పరిగణలోకి తీసుకుంటారు. పోస్ట్ ఆఫీస్ పథకాలలో పిల్లల నుండి వృద్దుల వరకు వివిధ రకాల పెట్టుబడి పథకాలు ఉన్నాయి.పోస్ట్ ఆఫీస్ పథకాల ద్వారా భాగస్వామికి ఖచ్చిత హామీ కలిగిన రాబడితో పాటు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. ప్రభుత్వ హామీ అంటే పెట్టిన పెట్టుబడికి పెరుగుదలకు మరియు ఏ విధమైన అవకతవకలు జరుగకుండా హామీ ఉంటుంది.
Women Loan Scheme : మహిళల కోసం అద్భుత రుణ పథకం..దళిత మహిళ లకు వడ్డీ లేకుండా రుణం
జూలై 1 నుంచి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పై ప్రభుత్వం వడ్డీని పెంచింది.పెరిగిన వడ్డీ ప్రకారం రికరింగ్ డిపాజిట్ (RD) పథకం పై 6.5 చొప్పున వడ్డీని కలిగి ఉంది. ఇప్పటి వరకు ఆర్డీ పై 6.2 వడ్డీ కలిపి వచ్చేది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం కాలపరిమితి 5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ పథకంలో మీరు రూ.100 పెట్టుబడి తో కూడా ప్రారంభించవచ్చు. ఇప్పుడు వున్న 6.5 వడ్డీ రేటుతో పోస్టాఫీసు RD పథకంపై రూ.2000,3000,4000 మరియు 5000 ల డిపాజిట్ పై ఎంత లాభం వస్తుందో తెలుసుకుందాం?
రూ.2000 RD పైమీరు గానీ ప్రతి నెలా రూ.2000 తో ఆర్డీని మొదలు పెడితే సంవత్సరంలో మీరు పెట్టే పెట్టుబడి మొత్తం రూ.24,000 అవుతుంది. 5 సంవత్సరాలలో మీ పెట్టుబడి మొత్తం 1,20,000 అవుతుంది. దీనిపై 6.5 శాతం వడ్డీని లెక్కపెడితే 5 సంవత్సరాలకి రూ.21,983 అవుతుంది. మీ డిపాజిట్ కాల పరిమితి ముగిసిన అనంతరం రూ.1,41,983 మీకు లభిస్తుంది.రూ. 3000 డిపాజిట్ చేస్తేమీరు నెలకు 3000 RD లో డిపాజిట్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో 36,000 అవుతుంది. 5 ఏళ్ళ కాలంలో రూ.1,80,000 అవుతుంది. దీనికి 32,972 వడ్డీ వస్తుంది.
Savings Scheme : సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్..
5 సంవత్సరాలలో మెచ్యూరిటీ తరువాత మీకు మొత్తం రూ. 2,12,972 లు మీకు వస్తాయి.రూ. 4000 రూపాయలు డిపాజిట్ పై పోస్ట్ ఆఫీస్ RDలో మీరు ప్రతినెలా రూ.4000.డిపాజిట్ చేస్తే సంవత్సరంలో రూ. 48,000 అవుతాయి. ఈ మొత్తం కలిపి 5 సంవత్సరాలలో రూ. 2,40,000 పెట్టుబడి అవుతాయి. వడ్డీ మొత్తం 43,968 అవుతుంది. పెట్టుబడి మరియు వడ్డీ కలిపి కాలపరిమితి అయిపోగానే రూ.2,83,968 పొందుతారు.రూ. 5000 రికరింగ్ డిపాజిట్ మీదనెలవారీ పోస్టాఫీసు RD మీద సంవత్సరంలో రూ. 60,000 పెట్టుబడి అవుతుంది. 5 ఏళ్ళలో మొత్తం రూ.3,00,000 డిపాజిట్ అవుతుంది. మీ పెట్టుబడి మీద 54,954 వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాల మెచ్యూరిటీకి మొత్తం రూ.3,54,954 మీకు లభిస్తాయి.