Telugu mirror : ఇటీవలి వరుస పరాజయాలతో పాటు తాజాగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ – 2023 లో ఘోర పరాభవం తరువాత టీం ఇండియా కొత్త టెస్ట్ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారన్న విషయం పై క్రీడా వర్గాలలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇటీవల ఇంగ్లండ్ లో జరిగిన 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన పోటీలో 209 పరుగుల తేడాతో ఘోర పరాజయం తో కెప్టెన్ రోహిత్ శర్మ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 ఏళ్ళ రోహిత్ శర్మ ను కెప్టెన్ గా తొలగించి, యువకులైన శుభ్ మన్ గిల్ లేదా శ్రేయస్ అయ్యర్ లకు టెస్ట్ జట్టు పగ్గాలు కట్టబెట్టాలనే డిమాండ్లు వినిపించాయి.
Crocodile : చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం ప్రత్యక్షం..
అయితే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో నిలదొక్కుకుంటున్న గిల్ వంటి ఆటగాళ్ళ పై కెప్టెన్సీ భారం మోపే కన్నా..మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నే మరోసారి సారధిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్,కామెంటేటర్ ఆకాష్ చోప్రా కు ప్రశ్న ఎదురైంది.
సమర్ధత కలిగిన నాయకుడు కోహ్లీ:
ఒక యూట్యూబ్ ఛానెల్ ప్లాట్ ఫాం మీద అభిమానులతో చర్చిస్తున్న సందర్భంలో.. ఓ నెటిజన్ కోహ్లీ మరలా టెస్ట్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని అడిగాడు. అభిమాని ప్రశ్నకు సమాధానంగా “అవును..కోహ్లీ తిరిగి కెప్టెన్సీ భాధ్యతలు తీసుకోగల సామర్ధ్యం కలిగి ఉన్నాడు.కానీ కోహ్లీ ఆ పని చేయలేడు. ఎందుకంటే గతంలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగమని ఎవరూ అతనిని కోరలేదు. కెప్టెన్ గా తప్పుకోవాలి అని తనంతట తానే నిర్ణయం తీసుకున్నాడు. కనుక మళ్ళీ కెప్టెన్సీ భాధ్యతలను తీసుకోక పోవచ్చు. కోహ్లీ కెప్టెన్ గా వైదొలుగుతానని ప్రకటించిన తరువాతే బీసీసీఐ కొత్త కెప్టెన్ ని నియమించింది.కనుక విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తిరిగి రావడం సాధ్యం కాదని” ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Telugu Mirror Panchagam: 04 జూలై 2023 మంగళవారం పంచాంగం
కోహ్లీ తానే తప్పుకున్నాడు!
2021 T20 ప్రపంచకప్ తరువాత T20 కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలగిన కోహ్లీ ని ఊహించని విధంగా వన్డే కెప్టెన్ గా బోర్డ్ తప్పించింది. అదే సమయంలో సౌతాఫ్రికాలో 2021-22 సంవత్సరంలో టీం ఇండియా పర్యటన సమయంలో టెస్ట్ మ్యాచ్ లో ఓటమి తరువాత కోహ్లీ తాను కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సమయంలో అప్పటికే టీం ఇండియా వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను టెస్ట్ జట్టు కెప్టెన్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా కోహ్లీ,రోహిత్ శర్మ కెప్టెన్లు గా WTC ఫైనల్ కి జట్టుని చేర్చినప్పటికీ ఒక్కసారి కూడా విజేతగా నిలుపలేక పోయారు.ప్రస్తుతం భారత జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు సన్నద్దమవుతుంది.జూలై 12 నుంచి ఆగష్టు 13 వరకు విండీస్ పర్యటనలో బిజీగా ఉండనుంది.