Telugu Mirror : తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ తమిళనాడులో రాత్రి పాఠశాలలను ప్రారంభించాలని తన పేరుతో నడిచే సంస్థను ఆదేశించారు. సమాజంలో గౌరవంగా బ్రతికేందుకు విజ్ఞానం అవసరమని, అందుకోసమే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని ఈ పాఠశాలలను ప్రారంభించాలని విజయ్ ఆదేశించారు.విజయ్ ఆదేశాలను అనుసరించి విజయ్ పీపుల్స్ మూమెంట్ ఆధ్వర్యంలో తమిళనాడులోని 14 ప్రాంతాలలో ‘తలపతి విజయ్ పయలకం’ మొదటి దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
Calcium Growth: శరీరంలో క్యాల్షియం లోపించంకుండా ఆహారంలో ఈ పదార్ధాలు చేర్చండి
పదవ తరగతి మరియు +2 పరీక్షలలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు విజయ్ పీపుల్స్ మూమెంట్ తరఫున గత నెల 17వ తేదీన హీరో విజయ్ విద్యా సంక్షేమ సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మూడు రోజులపాటు కార్యక్రమ నిర్వాహకులతో సూపర్ స్టార్ విజయ్ సమావేశాన్ని నిర్వహించారు.హీరో విజయ్ తో సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న వారు, కడలూరులో ఇప్పటికే వైఎస్ పీపుల్స్ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో సంవత్సరం నుండి నిర్వహిస్తున్న పాఠశాలలో చదివిన విద్యార్థులు పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించారని నటుడు విజయ్ కి తెలిపినారు.
ఈ పథకాన్ని తమిళనాడు అంతటా అమలు చేయాలని నిర్ణయం తీసుకొని కామరాజు జయంతి నుంచి అమలుపరచాలని ‘విజయ్ పీపుల్స్ మూమెంట్’ తరపున వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు భరిస్తుందని, వారికి తలపతి విజయ్ సూచించారు.హీరో విజయ్ ఆదేశాలను అందుకున్న విజయ్ పీపుల్స్ మూమెంట్ కామరాజ్ జయంతిని పురస్కరించుకొని తమిళనాడులో ఉన్న మొత్తం 234 నియోజకవర్గాలలో రాత్రి పాఠశాలలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. జూలై 15 కామరాజ్ జయంతి సందర్భంగా తమిళనాడులోని 14 ప్రాంతాలలో ‘తలపతి విజయ్ పాయలకం’ పేరుతో రాత్రి పాఠశాలలను ప్రారంభించారు.విజయ్ పీపుల్స్ మూమెంట్ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ కొడుంకయ్యూర్ ముత్తమిళ్ నగర్ లో పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు సోమవారం, జూలై 17, 2023 తిథి ,పంచాంగం
పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ తమిళనాడులోని కన్యాకుమారిలో 4, నామక్కల్ జిల్లాలో 3, క్రిష్ణగిరి జిల్లాలో 3, చెన్నైలో 1, సేలంలో 1, కోయంబత్తూరు, తిరుచ్చిలలో ఒక్కోటి చొప్పున ‘తలపతి విజయ్ పాయలకం’ ప్రారంభం అయ్యాయని రాబోయే రోజులలో తమిళనాడు అంతటా క్రమంగా స్కూళ్ళను విస్తరించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు.ఇప్పటివరకు పాయలకంలో విద్యాబోధన చేసేందుకు తమిళనాడు వ్యాపితంగా 302 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.పాఠశాల సాయంత్రం
5 గంటల నుండి 7గంటల వరకు జరుగుతుంది. ప్రస్తుతం 1నుండి 5 తరగతుల వరకు చదివేందుకు అవకాశం ఉంది. క్రమేపీ 12వ తరగతి వరకు పాఠశాలకు వచ్చే విద్యార్ధుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమిస్తారు.పాఠశాల నిర్వహణలో లోపాలు ఉంటే తల్లిదండ్రులు స్కూల్ లో ఉంచిన సలహాపెట్టెలో తెలియజేయవచ్చు అని విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ ప్రధాన కార్యదర్శి తెలిపారు.