Telugu Mirror : ప్రతి ఒక్క స్త్రీ తన ఇల్లు మరీ ముఖ్యంగా వంటగది(Kitchen) ఎల్లప్పుడూ క్లీన్ గా ఉండాలని కోరుకుంటారు.ఇంట్లో పనులన్నీ ఆడవాళ్లు చేస్తుంటారు కాబట్టి స్టవ్(Stove) మీద వంట చేస్తూ దీంతో పాటు మిగిలిన పనులు కూడా చేస్తుంటారు. అటువంటి సమయాల్లో ఒక్కొక్కసారి పొయ్యి మీద పాత్రలు ఉన్న సంగతి మర్చిపోతుంటారు. అవి అడుగంటడం జరుగుతూనే ఉంటాయి. ఇంకా టీ మరియు పాల పాత్రల గురించి చెప్పనక్కర్లేదు. పొయ్యి మీద పాలు, టీ పెట్టి మర్చిపోవడం వలన అవి పొంగిపోయి మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Xiaomi A Series: లేటెస్ట్ షావోమీ స్మార్ట్ టీవీ.ఫ్రీ గా చానల్స్ చూడవచ్చు
కొంతమంది ఎక్కువసార్లు, టీ పెడుతుంటారు. అలా ఎక్కువసార్లు టీ పెట్టడం వలన ఆ పాత్ర మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య చాలా తరచుగానే వస్తూ ఉంటుంది. గిన్నెలు అడుగంటితే వాటిని ఎంత రుద్దినా త్వరగా వదలవు. చేతులు కూడా నొప్పులు వస్తాయి. అలాంటి సందర్భంలో వాటిని సులభంగా ఎలా క్లీన్(Clean) చేసుకోవాలో తెలియజేస్తున్నాం.
బేకింగ్ సోడా:
వంట సోడా వంటల్లోనే కాకుండా మాడిన పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ముందుగా పాత్ర చుట్టూ బేకింగ్ సోడా (Baking Soda)వేసి ఐదు నుంచి ఆరు నిమిషాలు పాటు అలాగే వదిలేయాలి. తర్వాత పాత్రలు రుద్దే సోప్ లేదా లిక్విడ్ తో రుద్ది మంచినీటితో కడగాలి. ఇది పాత్రలోని అడుగంటిన భాగాన్ని చక్కగా శుభ్రపరుస్తుంది.
నిమ్మరసం:
మాడిన పాత్రలపై నిమ్మరసం(lemon juice)తో రుద్దడం వలన పాత్ర త్వరగా శుభ్రపడే అవకాశం ఉంది. నిమ్మకాయను సగానికి కట్ చేసి మాడిపోయిన దగ్గర రుద్దండి .తర్వాత వేడి నీళ్లు పోసి కొంతసేపు ఆగాలి .ఇలా చేయడం వల్ల పాత్ర లోపల ఉన్న నలుపుదనం పోతుంది.
Dazzler Eyes : చిన్న కళ్ళ కోసం పెద్ద టిప్స్ .. ఇక అందరి చూపు ఇప్పుడు మీ వైపు..
వెనిగర్:
అడుగు కాలిపోయిన మరియు మాడిపోయిన పాత్రలలో బేకింగ్ సోడా మరి వెనిగర్(Veneger) వేసి కలిపి అలానే వదిలేయండి. కొంత సమయం తర్వాత రుద్దండి. చాలా ఈజీగా అడుగంటిన పాత్రలు శుభ్రపడతాయి.టీ లేదా పాల పాత్ర మరి ఏదైనా పాత్రలు మాడిపోయినట్లయితే ,రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి తర్వాత అందులో నిండా నీళ్లు పోసి ఉంచాలి. ఇప్పుడు పాత్రలు రుద్దే సోప్ లేదా లిక్విడ్(Liquid) వేసి వేడి చేయాలి. తర్వాత ఒక గంట పక్కన ఉంచాలి .తర్వాత ఏదైనా స్పూన్ సహాయంతో గీరుతూ రుద్దండి.ఇలా చేయడం వల్ల కూడా మాడిపోయిన పాత్రలు శుభ్రపడతాయి.మేము చెప్పిన ఈ టిప్స్ లో ఏది మీకు వీలుగా ఉంటుందో అది అనుసరించండి. మాడిపోయిన, అడుగంటిన, మీ పాత్రలను సులువుగా శుభ్రపరుచుకోండి.