Telugu Mirror : భారత క్రికెటర్ లలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సచిన్ టెండూల్కర్ ఇంకాస్త ఆలోచిస్తే ఎం.ఎస్.ధోనీ లేదా విరాట్ కోహ్లీ. ఎవరిని అడిగినా ఈ పేర్లు మాత్రమే చెబుతుంటారు,దానికి కారణం ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్ లు వారి ఆట ద్వారానే కాకుండా యాడ్ లలో నటించడం అలానే ఎండార్స్ మెంట్ ల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు క్రికెటర్ లు డబ్బు సంపాదిస్తున్నారు.
Nothing Phone 2 : నథింగ్ ఫోన్ 2 ప్రీ ఆర్డర్స్ షురూ.. పూర్తి వివరాలు ఇవే!
అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ముగ్గురు క్రికెటర్ ల కన్నా భారత దేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెట్ ఆటగాళ్ళ జాబితాలో మొదటి స్థానం లో ఉన్న క్రికెటర్ గా వేరొక ఆటగాడు ఉన్నాడు. భారత క్రికెట్ ఆటగాళ్ళలో అత్యంత ధనవంతుడైన ఆ క్రికెటర్ ఎప్పుడూ భారత జట్టుకి ఎంపిక కాలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడిన ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం. బరోడా కు చెందిన మాజీ రంజీ ప్లేయర్ సమర్ జిత్ సిన్హ్ రంజిత్ సింగ్ గైక్వాడ్ సంపాదన మొత్తం విలువ రూ.20వేల కోట్లకు పైగానే ఉంటాయి.1987 నుంచి 1989 వరకు రంజిత్ సింగ్ గైక్వాడ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా బరోడా తరఫున కొనసాగాడు.
బరోడా జట్టు సభ్యుడిగా 6 రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడిన రంజిత్ సింగ్ గైక్వాడ్ కేవలం ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో కలిపి మొత్తం 119 పరుగులు మాత్రమే చేశాడు. రంజిత్ సింగ్ గైక్వాడ్ అత్యధిక స్కోర్ 65 పరుగులు. రంజిత్ సింగ్ గైక్వాడ్ బరోడా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్ గా కొద్ది కాలం వ్యవహరించాడు. అయితే రంజిత్ సింగ్ క్రికెటర్ గా సంపాదించిన ఆదాయం చాలా తక్కువ అయినాగానీ భారత క్రికెటర్లలో అత్యంత ధనవంతునిగా పేరుపొందాడు అంటే దానికి కారణం అతని కుటుంబ నేపథ్యం.
Telangana : తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు మంజూరు.. !
రంజిత్ సింగ్ వడోదరా రాజ కుటుంబానికి చెందినవారు.వడోదరా మహారాజు రంజిత్ సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్ ,శుభ్ గిన్ రాజే లకు 1967 ఏప్రిల్ 25 తారీఖున జన్మించిన ఏకైక సంతానమే రంజిత్ సింగ్ గైక్వాడ్. డెహ్రా డూన్ లో పాఠశాల విద్యను అభ్యసించి, విదేశాలలో చదువుకొన్న రంజిత్ సింగ్ గైక్వాడ్ కు ఆటలంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఆసక్తి. రంజిత్ సింగ్ కు క్రికెట్, ఫుట్ బాల్,టెన్నిస్ లపై ఆసక్తి కనబరచేవాడు.
5 తండ్రి మరణాంతరం 2012 మేలో సమర్ జిత్ సిన్హ్ రంజిత్ సింగ్ గైక్వాడ్ మహారాజా గా నియమితుడు అయ్యాడు. జూన్ 22 2012 లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో వేలాది మంది ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన పట్టాభిషేకం లో మహరాజుగా బాధ్యతలు తీసుకున్నాడు.
Telugu Panchangam: మిర్రర్ తెలుగు న్యూస్ ఈరోజు 07 జూలై 2023 తిథి, పంచాంగం.
మేనమామ తో ఉన్న 20 వేల కోట్ల రూపాయలు విలువైన వారసత్వ వివాదాలను 2013లో పరిష్కరించుకున్నాడు. రంజిత్ సింగ్ గైక్వాడ్ వాంకనేర్ రాష్ట్ర రాజ కుటుంబానికి చెందిన రాధికారాజే ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 6 ఇప్పటికి రంజిత్ సింగ్ ఆస్తి విలువ 20వేల కోట్ల రూపాయలు దాటింది.కొన్ని నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం విరాట్ కోహ్లీ ఆదాయం రూ.1050 కోట్లు గాను, ఎం.ఎస్.ధోనీ ఆదాయం రూ.1040 కోట్లకు పై గానే ఉంటుంది అని వార్తలు వచ్చాయి.