BMW CE 04 EV Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? BMW తన మొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేస్తోంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 24న BMW CE 04 స్కూటర్ లాంఛనంగా విడుదల కానుంది.
BMW Motorrad ఇండియా దేశంలోని మొట్టమొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్, కొత్త BMW CE 04 కోసం ప్రీ-లాంచ్ రిజర్వేషన్‌లను ప్రారంభించింది. BMW CE 04ను రిజర్వ్ చేయడానికి, కస్టమర్‌లు వారి స్థానిక BMW మోటోరాడ్ డీలర్ షిప్ ని సంప్రదించవచ్చు. BMW CE 04 2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశించబోతుంది.
పర్మనెంట్-మాగ్నెట్ లిక్విడ్-కూల్డ్ సింక్రోనస్ మోటార్‌ను అందుకుంటుంది. ఇది గరిష్టంగా 42 హార్స్ పవర్ ల శక్తిని మరియు 62 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ 8.9 kWh బ్యాటరీతో వస్తుంది. BMW CE 04 గరిష్టంగా 120 km/h (ఎలక్ట్రానిక్‌గా లాక్ చేయడం జరిగింది) మరియు వరల్డ్ మోటార్‌సైకిల్ టెస్ట్ సైకిల్ (WMTC) రేంజ్ 130 కి.మీతో ప్రయాణిస్తుంది. BMW CE 04తో పాటు, BMW గ్రూప్ ఇండియా BMW 5 సిరీస్ LWB, మినీ కూపర్ S మరియు మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్‌లను విడుదల చేస్తుంది.
BMW CE 04 EV Scooter
Also Read : Oman Sea : భారతీయులు 13 మంది గల్లంతు.. అసలు ఏం జరిగింది.?