Bonalu Celebrations : ఆషాఢం వచ్చిందంటే చాలు.. తెలంగాణాలో కూడా భారీ పండుగ జరగనుంది. తెలంగాణలో జులై 7 నుంచి జూలై 14 వరకు బోనాలు పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది.. హైదరాబాద్‌లో బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఆ పండుగ రోజున భక్తులు భక్తితో అమ్మవారిని ఆరాధిస్తారు.
తెలంగాణలో బోనాల పండుగకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహంకాళి అమ్మవారి బోనాలు ఈ ఉత్సవంలో విశేషం. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు.
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో బోనాలు పండుగ 2024 ప్రారంభమవుతుంది. అమ్మ బైలెల్లినాడే పఠిస్తూ భక్తులు అమ్మవారికి చీరలు, సారెలు, బోనాలు ఇస్తారు. ప్రతి ఏడాది మాదిరిగానే హైదరాబాద్‌లో బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభమవుతుంది. గోల్కొండ ఖిల్లాలో ఈ నెల 7వ తేదీ ఆదివారం నుంచి జాతర ప్రారంభం కానుంది. బోనాల వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ప్రణాళికలు రూపొందించింది.
గోల్కొండలో ప్రారంభమైన బోనాల వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటికి ఒక్కరోజే ఉన్నందున, అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్ని శాఖల సమీక్షతోపాటు భారీ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వైభవంగా జరగనున్నాయి. ఆషాఢ మాసం చివరి రోజున చివరి బోనంతో గోల్కొండ కోటకు చేరుకుని వేడుకలను ముగించుకుంటారు.