Brahmamudi serial feb 10th episode : నేటి బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో, రాజ్, కావ్య ఆఫీసుకు బయలుదేరుతారు. ఇంతలో కళ్యాణ్ సూటు,బూటు వేసుకొని అలా నడుస్తూ వస్తాడు. కళ్యాణ్ ని చూసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు ఆఫీసుకు రావడం ఏంట్రా? అని రాజ్ ప్రశ్నిస్తాడు. నువ్వు, నీ భార్యే ఆఫీసుకు వెళ్లాలా? కళ్యాణ్ రాకూడదా అని ధాన్యలక్ష్మి వంకరగా మాట్లాడుతుంది.
అలా అని నేను ఎందుకు అనుకుంట పిన్ని.. వాడికి ఆఫీసుకు రావడం ఇష్టం లేదు కదా, ఇలా వస్తే నేను షాక్ అవుతున్నాను అని అంటాడు రాజ్. కొన్ని కావాలంటే మరి కొన్ని వదిలేయాలి అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు నీకేం కావాలి రా అని రాజ్ అడుగుతాడు. ఇంత అనామిక అదేంలేదు, మొదటిసారి ఆఫీసుకు వెళ్తున్నాడు కదా చిన్న పిల్లవాడిలా మారం చేస్తున్నారు. సరే, నాకు చిన్న పని ఉంది అది అయ్యాక నేను వస్తాను నువ్వు ఆఫీసుకు వెళ్ళు అని రాజ్, కళ్యాణ్ కి చెబుతాడు.
కావ్య మనసు విరిచేసిన రాజ్..
రాజ్ శ్వేత దగ్గరికి వెళ్తుండగా, కావ్య అతన్ని ఫాలో చేయడం గమనిస్తాడు. ఈరోజు ఫుల్ క్లారిటీ ఇస్తా రా అని రాజ్ మనసులో అనుకుంటాడు. శ్వేత గుడ్ న్యూస్ చెబుతుంది. ఆమె భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధం అయ్యాడని చెబుతుంది. ఆ మాట వినగానే, కావ్య చూస్తున్నది గమనించి శ్వేతని ఎత్తుకొని తిప్పుతాడు రాజ్. అది చూసి కావ్య గుండె పగిలిపోతుంది. కావ్యకి వినిపించేలా, ఇక మన పెళ్ళికి ఏ అడ్డు లేదు అని కావ్య కూడా వెంటనే విడాకులు ఇస్తుంది అని రాజ్ అంటాడు.
కావ్య ఇక ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నీకు హార్ట్ లేదు రాజ్ అని చెప్పి శ్వేత ఇంట్లోకి వెళ్తుంది. అది కాదు శ్వేత.. నీకు ఇంతక ముందే చెప్పాగా కావ్య అంటే నాకు ఇష్టం లేదు అని అందుకే ఇదంతా చేస్తున్న అని చెప్పాడు. కానీ కావ్య లాంటి అమ్మాయి ని దూరం చేసుకుంటే మళ్ళీ దొరకదు అని అని శ్వేత అంటుంది. సరే, పార్టీ ఇవ్వమని రాజ్ అడుగుతాడు. పార్టీ దేనికి అంటే, నీకు విడాకులు ఇస్తున్నాడు కదా అని రాజ్ అంటాడు. సరే, ఒక సర్ప్రైజ్ ఇస్తాను నాతో రా అని అంటుంది శ్వేత.
అనామిక, రుద్రాణి ప్లాన్..
రుద్రాణి లాకర్ తాళాలు తీసుకొని అనామిక వద్దకు వచ్చింది. ఇక లాకర్ లో ఉన్న డబ్బు దొంగలించి ఆ నింద కావ్యపై వేయాలని అనుకుంటారు. ఇక లాకర్ లో నుండి 2 లక్షలు రుద్రాణి తీసుకొని అనామిక వద్దకు వస్తుంది. నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చేసుకున్నట్టు ఉంది. నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది రుద్రాణి. అనామిక కంగారు పడుతుంది. అదేంలేదు, నేను ఈ ఇంటికి రాణిని అవ్వాలి, కళ్యాణ్ రాజు అవ్వాలి అంతే అని అంటుంది అనామిక.
మీ అబ్బాయి అడ్డదారిలో వెళ్లారు..
ఇంతలో సుభాష్ కోపంగా వచ్చి , ఈరోజు క్లైంట్స్ తో రాజ్ కి మీటింగ్ ఉంది కదా, ఇంకా ఆఫీసుకు రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. శృతి నువ్వేం చేస్తున్నావ్ నువ్వు ఐన చెప్పాలి కదా అని అంటాడు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సర్, మెసేజ్ కూడా చేశాను కనీసం చూడలేదు అని చెబుతాడు.
ఇంతలో కావ్య వస్తుంది. నువ్వు, రాజ్ ఒకేసారి బయలుదేరారు కదా, రాజ్ ఎక్కడ ఉన్నాడు అని సుభాష్ అడిగాడు. ఆయన అడ్డదారిలో వెళ్లారు, నేను స్ట్రెయిట్ గా వచ్చాను మామయ్య అని కావ్య చెబుతుంది. అడ్డదారిలో తిరిగి చేసే అడ్డమైన పనులు ఏమున్నాయి వాడికి అని సుభాష్ అంటాడు. ఒకసారి ఫోన్ చేయమని చెబుతాడు. కావ్య, ఫోన్ చేస్తుంది కానీ రాజ్ కావాలనే లిఫ్ట్ చేయడు.రేపటి
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…