Brahmamudi serial feb 15th interesting episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో అమ్మమ్మ గారు కావ్యకి ఒక మంచి సలహా ఇస్తుంది. భర్తతో విడిపోవడం సరియైన పని కాదని, భర్త ప్రేమ దక్కించుకోవాలని చెబుతుంది. పెళ్లి అయ్యాక ఎంతో మంది సర్దుకొని బతుకుతున్నారు, మరికొందరు ప్రేమతో బతుకున్నారు, ఇంకొందరు ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి బతుకున్నారు అంతే కానీ విడిపోవాలని ఎవరు అనుకోట్లేదు అని చెప్పింది. మీ మనవడికి నా మీద ప్రేమ లేదు అమ్మమ్మగారు అని కావ్య అంటుంది. వాడికి ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని వెలికి తీయాలి అని అమ్మమ్మగారు చెబుతారు.
నువ్వు ఆకలితో ఉంటే వాడు నీ కోసం అన్నం తీసుకురావడం నేను చూశాను. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే అన్నం తినకుండా మధ్యలోనే వచ్చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిన్ను ఒక మాట అంటే నిన్ను సమర్థిస్తూ మాట్లాడాడు. అని రాజ్ గురించి చెప్పుకుంటూ వచ్చారు అమ్మమ్మగారు. దేవుడే అమ్మమ్మగారు, కానీ నాకు ఎందుకు ఈ శాపం పెడుతున్నాడు అని కావ్య దుఃఖిస్తుంది.
ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కావ్య.. పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలీదు కానీ ఈ సమయం ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు కూడా వేరే అబ్బాయితో చనువుగా ఉండు, అతనిపై ప్రేమగా ఉన్నట్టు నటించు అని చెబుతుంది. కావ్య, కనకం ఇద్దరూ ఈ సలహాకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత, కృష్ణమూర్తి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది మంచి నిర్ణయం అని చెబుతాడు.
Brahmamudi serial feb 15th interesting episode
వేరే అబ్బాయితో నటించడం నా వల్ల కాదు అమ్మమ్మగారు అని కావ్య అంటుంది. అమ్మమ్మగారు కావ్యకి ఒక పాము కథ చెబుతుంది. ఒక ఊరిలో పాము ఉండేది. ఆ పాము అందరిని కాటేస్తూ ఉండేది. ఆ ఊరి జనం పాముని చంపేయాలని అనుకోకుండా అసలు అటు వైపు వెళ్లడమే మానేస్తారు. ఇంతలో ఒక సాధువు అటు వైపు వస్తాడు. అప్పుడు పాము ఆ సాధువుని అందరూ నన్ను ద్వేషిస్తున్నారు ఈ బతుకు నాకు ఎందుకు అని అంటుంది. అయితే, ఆ సాధువు ఇప్పుడు నువ్వు ఇలా ఉంటె వేరే జన్మలో నికృష్టమైన జన్మ ఎత్తుతావు అందుకే ఎవర్ని కాటేయకు అని సాధువు చెప్పాడు.
అప్పటి నుండి ఆ పాము ఎవర్ని కాటేయకుండా ఉంటుంది. అయితే, మళ్ళీ ఆ సాధువు ఆ పాము దగ్గరికి వస్తే పిల్లలు ఆ పాముతో ఆడుకుంటూ, ఆ పాము తోక పట్టుకొని అటు ఇటు తిప్పుతారు. ఆ సాధువుని చూసిన పాము, మీరు కాటేయొద్దు అన్నారు. ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఎంత దీనంగా ఉందో అని ఆ పాము చెబుతుంది. నేను కాటేయొద్దు అని చెప్పాను గాని బుస కొట్టొద్దు అని చెప్పలేదుగా అని ఆ సాధువు చెప్పాడు.
ఇప్పుడు కూడా మనం బుస కొడుతున్నాం కాటు వేయట్లేదు అని కావ్యకి అమ్మమ్మగారు చెబుతుంది. కావ్య ఇలా చేయడానికి ఇప్పుకుంటుంది.
కావ్య తన అత్తారింటికి రాగానే అందరూ కావ్యపై విరుచుకుపడతారు. ఆ రెండు లక్షలు తీసావ్ అని నింద వేస్తారు. లాకర్ ఉన్న డబ్బు రెండు లక్షలు మిస్ అయ్యాయని అందరూ అంటారు. కావ్యని తిడతారు. ఇంతలో స్వప్న వస్తుంది. నా చెల్లిని దొంగ అనడానికి మీరు ఎవరు అని స్వప్న అంటుంది. ఆ రెండు లక్షలు కావ్యనే నాకు ఇచ్చింది అని చెబుతుంది.