Brahmamudi Serial feb 16th episode : అక్కపై పడిన నింద చెరిపేసిన చెల్లి, రాజ్ కి సర్ప్రైజ్ ఇచ్చే ప్లాన్ లో కావ్య

బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, లాకర్ లో నుండి రెండు లక్షలు రుద్రాణి వాళ్ళు తీసి కావ్యపై ఆ నింద వేయాలని చూస్తారు.

Brahmamudi Serial feb 16th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, లాకర్ లో నుండి రెండు లక్షలు రుద్రాణి వాళ్ళు తీసి కావ్యపై ఆ నింద వేయాలని చూస్తారు. ఇంతలో స్వప్న వచ్చి నా చెల్లిని అనడానికి మీకు ఎంత ధైర్యం అని అందర్నీ నిలదీసిస్తుంది. అపర్ణ దగ్గరికి వచ్చి సారీ ఆంటీ జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద నింద పడేసరికి బ్లాక్ అయిపోయినట్టుంది ఆ రెండు లక్షలు కావ్యనే నాకు ఇచ్చింది.

కావ్య నాకు రెండు లక్షలు ఇచ్చిన మాట నిజం కానీ నన్ను వాడుకోమని కాదు మా పుట్టింటికి పంపడానికి అసలే కాదు లేనప్పుడు ఇంట్లో వాళ్లకి ఏ అవసరం వస్తుందోనని ఎవరైనా ఇబ్బంది పడతారేమోనని, వచ్చేవరకు నా దగ్గరే ఉంచమని చెప్పి వెళ్ళింది. ఆ డబ్బు నేను తీసుకొని వస్తాను అని చెప్పి స్వప్న వెళ్లి ఆ డబ్బు తీసుకొస్తుంది. అపర్ణ ధాన్యలక్ష్మికి ఆ డబ్బు చూపిస్తూ ఇప్పటిదాకా మాటలు జారిన వాళ్ళు ఎలా వెనక్కి తీసుకుంటారు అని ప్రశ్నించింది. ధాన్యలక్ష్మికి మాటలు రాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

brahmamudi-serial-feb-16th-episode-kavya-plans-to-give-a-surprise-to-raj-after-clearing-the-blame-on-her-sister

Brahmamudi Serial feb 16th episode

రుద్రాణి తన గదిలోకి వెళ్తుంది. వెళ్లి బీరువాలో డబ్బు చూస్తే డబ్బు కనిపించదు. అక్కడ ఇచ్చిన రెండు లక్షలు నా డబ్బు అని అంటుంది రుద్రాణి. నాకు తెలియకుండా నీ దగ్గర రెండు లక్షలు ఉన్నాయా అని రాహుల్ అడుగుతాడు. రుద్రాణి గుర్తొచ్చి మళ్ళీ బీరువా మొత్తం వెతుకుతుంది. మొత్తం 5 లక్షలు మిస్ అవుతాయి. ఈలోగా స్వప్న వచ్చి అర్ధం అయిపోయిందా అని అంటుంది. మిగతా మూడు లక్షలు ఏమి చేసావ్ అని రుద్రాణి అడుగుతుంది. ఇంకెక్కడ మూడు లక్షలు, షాపింగ్ చేసినవి ఆ మూడు లక్షలతోనే అని చెబుతుంది. కావ్య స్వప్న దగ్గరికి వచ్చి థాంక్స్ అక్క, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది కావ్య. నువ్వు మారిపోయావు అక్క అని చెబుతుంది.

లేదు నేను నేనే నీకు పాత బట్టలు ఉన్నా నాకు కొత్త బట్టలు ఉన్నా నువ్వు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బు నాకు ఇస్తే తప్ప అన్నం తిననని మొండికేసి మరీ కొత్త బట్టలు కొనుక్కున్న నేను ఏమి మారలేదు. అందరూ తప్పు చేశానని నామీద నిందిస్తే నువ్వు చాలా కష్టపడ్డావు నాకు సాయం చేశావు ఇప్పుడు నీ మీద నిందపడింది.

అలా మంచి పనుల కోసమే పుట్టిన దానివి నువ్వు నేను నా కోసమే పుట్టాను నాకు నచ్చిందే చేస్తాను నా సంతోషమే నేను చూసుకుంటాను నాకు స్వార్థం ఎక్కువ నేను మారాలని కూడా అనుకోవడం లేదు పాము కోరలు తీస్తే మన మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మూడో మనిషి వస్తే మాత్రం తొక్కినారదిస్తాను అని స్వప్న కావ్య తో చెబుతుంది.

కావ్య తన గదిలోకి రాగానే రాజ్ శ్వేతతో మాట్లాడడం మొదలు పెడతాడు. కానీ కావ్య ఏమి అనకుండా మీరు మాట్లాడుకోండి, నేనేం అనుకోను.. నేను ఇక్కడ ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనుకుంట కదా అందుకే నేను బయటికి వెళ్లి పడుకుంటాను అని కావ్య చెబుతుంది. కానీ బయటికి వెళ్లి పడుకుంటే అందరికీ అనుమానం వస్తుంది. అందుకే దూది పెట్టుకొని పనుకుంటాను అని చెప్పి పనుకుంటుంది.

Comments are closed.