Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
తెలియని వాళ్ళకి అప్పు సహాయం..
పాపని కిడ్నాప్ చేసిన రౌడీల నుండి పాపని కాపాడేందుకు అప్పు, ఆ పాప తల్లి కష్టపడుతూ ఉంటారు. ఆ పాపని కాపాడే ప్రయత్నంలో అప్పు వాళ్ళ స్నేహితుల సహాయం కూడా తీసుకుంటుంది. మరి ఇంతకీ ఆ పాపని రక్షిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
Also Read : Brahmamudi serial feb 2nd episode : కావ్యని అప్పలమ్మ అంటున్న రాజ్, గెటప్ మార్చిన కావ్య
కావ్య గెటప్ మార్చిన స్వప్న..
అందరూ కూర్చొని ఉండగా, డెలివరీ బాయ్ వచ్చి మీకు ఆర్డర్ వచ్చింది మేడం అని చెబుతాడు. అంత మందిలో ఆర్డర్ వచ్చింది ఎవరికో అర్ధం కాదు. అయితే, పేరు చూసాక రుద్రాణి షాక్ అవుతుంది. బిల్ రూ.70,000 అయిందని తెలియగానే ఉలిక్కిపడుతుంది. అంత బిల్ అయ్యే షాపింగ్ నేను చేయలేదు అని చెబుతుంది. అది నేనే చేశాను అని స్వప్న వాళ్ళకి చెబుతుంది. అంత బిల్ అయ్యేలా ఎందుకు చేశావ్ అని రుద్రాణి అడుగుతుంది. నా కోసం కాదు నా చెల్లి కోసం చేశాను అని చెబుతుంది.
కావ్య కోసం అయితే నేను తీసుకునేవాడిని కదా స్వప్న అని రాజ్ అంటాడు. నా చెల్లిని ఎవరో అప్పలమ్మ లాగా ఉన్నావు అని అన్నారంట అందుకే నా చెల్లిని రెడీ చేసి అందంగా ఉంటుందని నిరూపిస్త అని చెప్పి, కావ్యను రెడీ చేయడానికి తీసుకెళ్తుంది.
చెల్లి కోసం న రూ.70,000 లాస్ అని అనుకుంటుంది రుద్రాణి, ఇంతలో అపర్ణ ఆ డబ్బు నేను ఇస్తాను..నా కోడలి కోసమేగా స్వప్న ఖర్చు చేసింది అని చెబుతుంది.
కావ్యని మెచ్చుకున్న అమ్మమ్మ..
స్వప్న కావ్యని రెడీ చేసి తీసుకొస్తుంది. కావ్య రెడీ అవ్వగానే అందరికి నచ్చుతుంది. స్వప్న ముందే ఎవరికైతే కావ్య రెడీ అవ్వడం నచ్చదో వారివి దిష్టి కళ్ళు అని చెబుతుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి వాళ్ళకి కావ్య నచ్చదు.