Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
పాప ప్రాణాలను కాపాడిన అప్పు..
రౌడీలకు తెలియకుండా అప్పు పాపను కాపాడే ప్రయత్నంలో ఉంది. రౌడీలకు తెలియకుండా పాపను కాపాడాలని అనుకుంటారు. కానీ పాపను తీసుకొని బయటికి వచ్చే సమయంలో రౌడీలు వాళ్ళని చూస్తారు. మీ ఇద్దరు కలిసి మా నుండి తప్పించుకోవాలని చూస్తున్నారా? అని రౌడీలు అంటారు. ఇంతలో పోలీసులు వస్తారు. ఆ రౌడీలను పోలీసులు పట్టుకొని వెళ్తారు. ఆమె అప్పుకి ధన్యవాదములు చెబుతుంది.
Also Read : Brahmamudi serial feb 3rd episode : రాజ్ కి నచ్చేలా ఉండాలనుకుంటున్న కావ్య, గెటప్ మార్చిన స్వప్న,
కొత్త లుక్ లో ఎంట్రీ ఇచ్చిన కావ్య..
బ్లూ సారీలో కావ్య మరింత అందంగా ఎంట్రీ ఇచ్చింది. కావ్యాన్ని చూసి రాజ్ షాక్ అయ్యాడు. ఆఫీసులో అందరూ కావ్య లుక్ బాగుంది అని అంటారు. ఇంతలో రాజ్ కి శ్వేత ఫోన్ చేసి కలవాలి అని అనుకున్నాం కదా వస్తున్నావా అని రాజ్ ని అడుగుతుంది. కలుద్దాం అనుకున్నాం కదా వేరే ప్లేస్ ఎందుకు ఆఫీసుకు రమ్మని చెబుతాడు రాజ్. శ్వేత ఆఫీసుకు వస్తుంది. కావ్యకి కోపం రావాలని ఇంకా ఎక్కువ చేస్తాడు రాజ్. ఫైల్ తీసుకొని రాజ్ క్యాబిన్ లోకి వస్తుంది కావ్య. శ్వేతతో వంకరగా మాట్లాడుతుంది. కావాలనే శ్వేతపై ఇంకా ఇంక్ పడేలా చేస్తుంది.
రాజ్ కాపురం గురించి అడిగిన శ్వేత..
మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది రాజ్ అని శ్వేత రాజ్ ని ప్రశ్నిస్తుంది. కావ్య మన ఇద్దరినీ అనుమానిస్తోంది అని చెబుతాడు. కానీ, కావ్య నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టు రాజ్ చెబుతాడు. మన అటువంటి సంబంధం ఏమి లేదని వెళ్లి చెప్పి వస్తాను అని శ్వేత చెబుతుంది. కానీ రాజ్ వెళ్లకుండా ఆపుతాడు. ఆమెతో జీవితం పంచుకోవడం ఇష్టం లేదని చెబుతాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని శ్వేత రాజ్ కి చెప్పి వెళుతుంది.