Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
రాజ్ మరియు శ్వేత మధ్య గొడవ జరుగుతుంది. కావ్య మనల్ని తప్పుగా అర్థం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాను. భార్యాభర్తలు ఒకటిగా లేకపోతే ఏమి జరుగుతుందనే దానికి నేనే ఉదాహరణ. నా జీవితం ఎలా మారుతుందో చూశావ్ కదా అని శ్వేత రాజ్ తో అన్నది. రాజ్ శ్వేతని , “అది వేరు, ఇది వేరు” అన్నాడు. నాకు ఆమె ఇష్టం లేదు. అందుకే నాకు విడాకులు కావాలని అనుకుంటున్నాను అని రాజ్ అన్నాడు.
కావ్య ఎందుకు ఇష్టం లేదు..
నోరుమూసుకో రాజ్. అలా అయితే, నీకు మరియు నా భర్తకు మధ్య తేడా ఏముంది? అతను పైన కనిపిస్తాడు. నువ్వు కనిపించడం లేదు. కానీ ఇద్దరూ వదిలించుకోవాలనుకుంటున్నారు అంతే. అసలు కావ్యకి విడాకులు ఇవ్వడానికి ఒక కారణం చెప్పు. ‘ ఇంట్లో పని చేయదా? లేక కుటుంబాన్ని గౌరవంగా చూసుకోదా..లేక భర్తను గౌరవించలేదా?’ అని శ్వేత ప్రశ్నిస్తోంది. అలాంటిదేమీ లేదని రాజ్ చెప్తాడు. కానీ ఈ కారణం చేతనైన నాకు విడాకులు ఇస్తుందని అనుకుంటున్నాను అని రాజ్ అన్నాడు.
నేను ఇది ఒప్పుకోను రాజ్, నా వల్ల ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. నేను ఈ అపార్థాలను ఇప్పుడే కావ్య చెప్పి తొలగిస్తాను అని శ్వేత వెళుతుండగా, రాజ్ వెళ్లాడకుండా శ్వేతని అడ్డుకుంటాడు. మరోవైపు కావ్యకు కోపం వస్తుంది. కావ్య కళ్యాణ్ కి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పింది. నిన్ను ఆ దుస్తుల్లో చూసి అన్నయ్య ఫిదా అయ్యాడా అని కళ్యాణ్ అడగ్గా… ‘అతను వచ్చి నన్ను ఎత్తుకొని మరి తిప్పాడు’ అని కావ్య సమాధానం చెప్పింది.
ఇక్కడ ఒళ్ళు మండతుదని కళ్యాణ్ తో అంటుంది కావ్య. అక్కడ శ్వేత ఉందా? అని అడుగుతాడు కళ్యాణ్. అవును ఇక్కడే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాను అని చెబుతుంది కావ్య. మరోవైపు, రాజ్ శ్వేత ఆఫీస్ నుండి వెళుతుంది. మీ మధ్య ఏమి లేదు ఉన్నది ఒక్కటే అదే మీ మధ్య దూరం. నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావు కాబట్టి నేను నీకు సమస్య కాకూడదు. నా వల్ల మీరు విడిపోతే నేను ఎలా ఊరుకుంటాను అని శ్వేత అడుగుతుంది.
Also Read : Brahmamudi Serial Feb 5th Episode : కొత్త లుక్ లో కావ్య అదుర్స్ – రాజ్ ఫ్లాట్.. శ్వేతపై కోపంగా ఉన్న కావ్య
ఆమెతో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను విడిపోవడానికి కారణం వెతుకుతున్నాను. ఇప్పుడు ఆమె మన ఇద్దరినీ చూసింది. ఇప్పుడు అది నాకు తేలికవుతుందని అని రాజ్ చెప్పాడు. నాకు క్యారెక్టర్ లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. కావ్య నిజంగా స్వీట్ గర్ల్. పెళ్లయ్యాక ఫిక్స్ అయ్యాను. ఆమె నాకు కరెక్ట్ కాదు అని రాజ్ శ్వేతతో చెప్పాడు.
శ్వేత స్పందిస్తూ, రాజ్, నీ ఆలోచన తప్పు. ఇంతలో కావ్య వచ్చి గమనించింది. రాజ్ చూసాడు. రాజ్ కావ్యని చూసి నవ్వుతూ శ్వేతను ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. రాజ్ శ్వేత భుజం మీద చెయ్యి వేసి, “ఏం ఆలోచించకు వెళ్ళు” అన్నాడు.” ఇది చూసి కావ్య చాలా బాధపడింది.
అప్పుకి పెళ్లి సంబంధం..
అప్పు పిజ్జా డెలివరీ చేస్తుండగా మా అబ్బాయి చూసాడు. అందుకే నేరుగా వచ్చాం. నా కొడుకు సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నాడు. సొంత ఇళ్ళు మరియు ప్రతి నెల రూ.50,000 జీతం వస్తుంది. మేము అమ్మాయి గురించి ప్రతిదీ తెలుసుకున్నాము. ఆమె ఒకరిని ప్రేమించినట్లు తెలిసింది. కానీ అతనికి పెళ్లయింది. ఈ రోజుల్లో ఇలాంటి వాటిని ఎలా పట్టించుకుంటామని అని ఆ అబ్బాయి తల్లి చెబుతుంది. ఇంతలో అప్పు వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కనకం అప్పును ఇంట్లోకి తీసుకెళ్లి పెళ్లి సంబంధం అని చెబుతుంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని అప్పు చెబుతుంది.
పెళ్లి వద్దనడానికి కారణం ఏంటి?
అప్పు వారి వద్దకు వెళ్లి ఇప్పుడు నాకు పెళ్లి ఇష్టం లేదు అంటుంది. నేను ఇష్టం లేదా లేక పెళ్లి ఇష్టం లేదా అని పెళ్లి కొడుకు అడుగుతాడు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అప్పు వాళ్లకి చెబుతుంది. మీరు మీ మనసు మార్చుకుంటే, మాకు ఫోన్ చేసి చెప్పమని ఆ అబ్బాయి తల్లి అంటుంది. పెళ్లి ఎందుకు చేసుకోకూడదని, ఏం సాధించాలనుకుంటున్నావు అని కనకం అడిగితే, ఇదే నా జిందగీ. జిందగీలో పెళ్ళి కాకుండా చేసేవి చాలా ఉంటాయి అని అంటుంది. నేను పోలీసు కావాలనుకుంటున్నాను. ఎప్పుడో ఆలోచించాను. కానీ ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అని అప్పు చెబుతుంది దీంతో కనకం, కృష్ణమూర్తి ఆశ్చర్యపోయారు. మరోవైపు కావ్య ఇంటికి వెళ్తుండగా శ్వేత భర్త ఆమె కారు దగ్గరకు వచ్చి ఆపాడు. కావ్య అతనిపై ఫైర్ అవుతుంది.
శ్వేత భర్తను తిట్టిన కావ్య..
నేను శ్వేత భర్తని, మీ భర్త, నా భార్య మనల్ని మోసం చేశారు అని అంటాడు. భార్యని అదుపులో పెట్టుకొని భర్తని మా ఏరియాలో చవట, దద్దమ్మ అని అంటారు అని కావ్య అతనిపై ఫైర్ అవుతుంది. ఇంకెప్పుడు నా భర్తని ఇలా అనకు అని తిడుతుంది. భార్యని కరెక్ట్ గా ఉంచుకోవడం నేర్చుకోమని తిడుతుంది. ఇంకోసారి నా కారుకి అడ్డు వస్తే బాగోదు అని చెబుతుంది. వామ్మో ఈమె ఇలా ఉంది కాబట్టే ఆ రాజ్ నా భార్యని తగులుకున్నాడు అని అనుకుంటాడు శ్వేత భర్త. ఈమె కన్నా న భార్యే నయం అని ఫీల్ అవుతాడు.