Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
కళ్యాణ్ ని ఆఫీసుకు వెళ్ళమంటున్న అనామిక..
కళ్యాణ్ కవితలు రాస్తూ ఉంటాడు. అనామిక కళ్యాణ్ దగ్గరకి వచ్చి నువ్వు ఇలా కవితలు రాస్తూ కూర్చుంటే నీకు విలువ ఉండదు, ఎవరూ నిన్ను లెక్క చేయరు అని అంటుంది. మీ నాన్న, పెదనాన్న, మీ అమ్మయ్య ఆఖరికి మీ వదిన కూడా ఆఫీసుకు వెళ్తుంది. నువ్వు కూడా వాళ్ళలాగా ఆఫీసుకు వెళ్ళవా? వాళ్ళ లాగా పని చేయవా? అని అడుగుతుంది.
‘నాది బిజినెస్ మైండ్ కాదు’ అనామిక అని కళ్యాణ్ చెబుతాడు. నా భర్త బిజినెస్ వర్క్ చూసుకోకుండా ఇలా ఇంట్లో ఉంటే మీ అమ్మగారికి అయిన నాకు అయిన బాధగా ఉంటుంది కదా అని అనామిక అంటుంది. సరే! ఆలోచిస్తాను అని కళ్యాణ్ చెబుతాడు. ఆలోచించడం కాదు వెళ్ళాలి అని అనామిక చెప్పి వెళ్తుంది.
నా కార్ తీసుకెళ్ళు..
Also Read : Brahmamudi Serial jan 29th Episode : మొదటిరోజు కావ్య ఆఫీసుకు..షాక్ లో ఉన్న రాజ్, ఆనందంలో కావ్య
కావ్య బయట క్యాబ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అపర్ణ కావ్యని పిలిచి ఏంటి అక్కడ ఏం చేస్తున్నావ్? టైంకి ఆఫీసుకు వెళ్ళాలి కదా అని అపర్ణ అంటుంది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న అత్తయ్య అని కావ్య చెబుతుంది. అపర్ణ తన కార్ కీస్ ఇచ్చి, నా కార్ లో వెళ్ళు, బయట డ్రైవర్ యాదగిరి ఉంటాడు అతన్ని తీసుకొని వెళ్ళు అని చెబుతుంది. ధాన్యలక్ష్మి కోపంతో వెళ్తుంది. కావ్య అపర్ణ కారులో ఆఫీసుకు వెళ్తుంది.
కుళ్ళుకుంటున్న ధాన్యలక్ష్మి..
ఎదో మర్చిపోయా అని ఆలోచిస్తూ ఉంటాడు ధాన్యలక్ష్మి భర్త. ఇంతలో ఆఫీస్ బ్యాగ్ చూసి, ఆఫీసుకు వెళ్లడం మర్చిపోయ అని బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుండగా ఇంతలో ధాన్యలక్ష్మి గదిలోకి వస్తుంది. ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీతో పాటు కళ్యాణ్ ని కూడా ఆఫీసుకు తీసుకెళ్లండి అని చెబుతుంది. కళ్యాణ్ ని ఆఫీసుకు రాకూడదు అని ఎవరు చెప్పలేదు, వాడికి ఇష్టం ఉండదు అనే కదా వాడిని ఒంటరిగా వదిలేశాం. మళ్ళీ ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నావ్ అని అంటాడు. మంచిగ ఉన్న కాపురంలో నిప్పులు పోయకు అని అతను ధాన్యలక్ష్మికి చెప్పి ఆఫీసుకు వెళ్తాడు.
కావ్యకి గ్రాండ్ వెల్కమ్..
కావ్య ఆఫీసుకు రాగానే అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతారు. రాజ్ కోపంతో ఉంటాడు, శృతిని క్యాబిన్ కి రమ్మంటాడు. క్యాబిన్ కి పిలిచి ఆమెను తిడతాడు. నేను చెప్పేది కాస్త వినండి సర్ అని శృతి అడుగుతుంది. నేను అసలు వినను గెట్ అవుట్ అంటాడు. నాకు చెప్పు శృతి అని కావ్య అంటుంది. ఇలా వెల్కమ్ చెప్పమని సుభాషిత సర్ చెప్పారు అని, అపాయింట్మెంట్ ఆర్డర్ రాజ్ సర్ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పారు అని శృతి వివరిస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి రాజ్ కి ఇస్తుంది శృతి, రాజ్ కోపంతో సంతకం చేసి కావ్యకి ఇస్తాడు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…