Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
కావ్య ఆఫీసులో.. రాజ్ చిరాకుతో..
వర్క్ చెప్పేంత వరకు ఇక్కడ నుండి కదలను అని కావ్య రాజ్ తో చెబుతుంది. కొంచం ముందుకు వెళ్లి పక్కకు తిరిగితే కిచెన్ వస్తుంది వెళ్లి టీ పెట్టు అని అంటాడు రాజ్. నేను ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయ్ ని మీకు సేవలు చేసే ప్యూన్ ని కాదు అని కావ్య అంటుంది.
మీరు వర్క్ ఇవ్వకపోతే మిమ్మల్నే చూస్తూ ఉంటాను అని కావ్య అంటుంది. రాజ్ కి చిరాకు వచ్చి శ్వేతాని పిలిచి ఏం డిజైన్స్ వేయాలో చెప్పమని చెబుతాడు. శ్వేతా వేసిన డిజైన్స్ చూసి శ్వేతపై విరుచుకుపడతాడు రాజ్.
కళ్యాణ్, అనామికాని చూసిన అప్పు..
Also Read : Brahmamudi Serial jan 30th Episode : కావ్యకి గ్రాండ్ వెల్కమ్.. షాక్ అయిన రాజ్, కుళ్ళుకుంటున్న ధాన్యలక్ష్మి
అప్పు లేట్ గా వచ్చినందుకు ఓనర్ తిడతాడు. ఇంకోసారి ఇలా జరగదు అని అప్పు చెబుతుంది. అనామిక అప్పుని చూసి కళ్యాణ్ కి ఐస్ క్రీం తినిపిస్తుంది. ఇక అప్పు వెళ్ళిపోగానే తినిపించకుండా పక్కన పెడుతుంది. ఏంటి అని అడిగితే అందరూ చూస్తున్నారు అని చెబుతుంది. అప్పు వారిద్దరిని చూసి బాధపడుతూ వెళ్తుంది.
శ్వేతా దగ్గరకు వెళ్లిన రాజ్, రాజ్ ని ఫాలో అయిన కావ్య..
ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. తన భర్త అరవింద్ వస్తున్నాడని, డోర్ తీయకపోతే పగలకొట్టుకొని వస్తానని చెబుతున్నాడని శ్వేత రాజ్ హోం చెబుతుంది. రాజ్ వెంటనే శ్వేత దగ్గరికి వెళ్తాడు. ఇంతలో శ్వేత భర్త అరవింద్ శ్వేతని కొడుతూ ఉంటాడు. రాజ్ వచ్చి అరవింద్ ని నెట్టేసి అరవింద్ తో గొడవ పడతాడు. ఇటు కావ్య రాజ్ ని వెతుక్కుంటూ వెళ్తుంది.
రేపటిలోగా విడాకుల పేపర్స్ మీద సంతకం చేయమని బెదిరిస్తాడు. నేను తలచుకుంటే నిన్ను జీవితాంతం జైలులో ఉంచుతా లేకపోతే లైఫ్ లాంగ్ బెడ్ మీద పడిఉండేలా చేస్తా అని రాజ్ అరవింద్ తో చెబుతాడు.
శ్వేతాని ఓదారుస్తున్నప్పుడు కావ్య చూస్తుంది. నీకు నేను ఉన్నాను, ఈ విడాకుల పని అయిపోగానే జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని రాజ్ చెప్పడం కావ్య వింటుంది. ఇద్దరు పక్క పక్కనే ఉండడం చూసి కావ్య ఏడుస్తూ ఉంటుంది.