Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
రాజ్ ఫోనును దొంగతనంగా కావ్య, కళ్యాణ్ చూస్తారు. కళ్యాణ్ ఫోన్ చూసి రాజ్ మరియు శ్వేత మధ్య స్నేహానికి మించింది ఎదో ఉందని చెబుతాడు. కావ్య షాక్ అవుతుంది. అన్నయ్య తో పాటు కావ్యని కూడా ఆఫీస్ కు వెళ్ళమని చెబుతాడు కళ్యాణ్. అన్నయ్యతోనే ఎప్పుడూ ఉండేలా ఉండాలి. ఇలా అనుమానపడుతూ గట్టిగా మాట్లాడొద్దు వదిన అని కవి కావ్యకి చెబుతాడు.
అప్పు డ్యూటీకి..
Also Read : Brahmamudi serial today episode : కాపురం నిలబెట్టుకునే పనిలో కావ్య, ఇంతకీ ఏం చేయనుంది.
అప్పు ఇక జాబ్ చేయాలనీ నిర్ణయించుకుంటుంది. కానీ అప్పు తల్లిదండ్రులు పై చదువులు చదువుకో అని చెబుతారు లేకపోతే నువ్వు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం చూసుకోమని చెబుతారు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని ఉద్యోగం చేసి మీకు సహాయం చేస్తాను అని అప్పు చెబుతుంది.
తికమక పడుతున్న రాజ్..
కావ్య బెడ్ రూమ్ లో ఆలోచిస్తూ ఉండగా, రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి కావ్య చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కుంటాడు. ఎందుకు లాక్కున్నారు ఫోన్ అని అడుగుతుంది. కొత్త క్లయింట్ ఫోన్ చేసింది అని చెబుతాడు రాజ్. కావ్య రాజ్ తో ఇండైరెక్ట్ గా శ్వేత గురించి మాట్లాడుతుంది. రాజ్ తికమకపడుతూ ఉంటాడు.
తోడికోడళ్ళ మధ్య గొడవ..
కళ్యాణ్ అపర్ణ దగ్గరకు వచ్చి, పెద్దమ్మ గ్రీజర్ రిపేర్ చేసే అతనిని ఏ టైంకి రమ్మని చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు అపర్ణ వద్దు కళ్యాణ్ రాజ్ చూసుకుంటాడులే అని చెబుతుంది. నన్ను, అన్నయ్యని వేరుగా చూస్తున్నావా పెద్దమ్మ అని కళ్యాణ్ అడుగుతాడు. నేను అలా అనుకోవడం లేదు కానీ అనుకునేలా చేస్తున్నారు అని అపర్ణ చెబుతుంది.
ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి, డొంకతిరుగుడు మాటలు ఎందుకు అక్క, నేను నిన్న అలా మాట్లాడా అనే కదా ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ అని అంటుంది. ఇలా గొడవ పడుతుండడం చూసి, ఇక అమ్మమ్మ వారిద్దరిని బయటికి తీసుకెళ్తుంది. వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. చివరికి మేము మంచిగానే ఉంటాం అని చెబుతారు.