Brahma Muhurtam–బ్రహ్మ ముహూర్తం ఎందుకు ప్రత్యేకం? దీంతో విజయానికి సంబంధమేంటి?

Telugu Mirror : బ్రహ్మ ముహూర్తానికి చాలా ప్రత్యేకత మరియు ప్రాధాన్యత ఉన్నాయి. బ్రహ్మ అనగా దైవం. ముహూర్తం అనగా సమయం. బ్రహ్మ ముహూర్తం అనగా భగవంతుని సమయం. ఈ ముహూర్తంలో లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి .ఈ సమయంలో మన శరీరం ప్రశాంతంగా ,ఒత్తిడి లేకుండా కొత్త శక్తి మరియు ఉత్సాహం తో నిండి ఉంటుంది. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ (positive Energy)చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది.

ఈ సమయంలో దేవతలు(Gods) భూమిని సందర్శిస్తారని చాలామంది నమ్ముతారు. ఈ సమయంలో మనం ఎలాంటి పనిచేసిన విజయం పొందడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం సమయం చాలా పవిత్రమైన సమయం.ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మరి ఎలాంటి పనులు చేయకూడదో చూద్దాం.

Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో డబ్బు, ఆనందానికి లోటే ఉండదు..

*సూర్యోదయానికి గంటన్నర ముందు వచ్చే సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయం అంటారు. అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదున్నర మధ్యకాలం. ఈ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్ లో ముఖ్యమైన విషయాలలో, నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సరైన ప్రణాళికను ఏర్పరచుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. ఎందుకంటే ఒత్తిడికి లోనవుతారు. దీని వల్ల మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Image credit:Adhan Adhyatmika

ఈ సమయంలో చేయవలసిన పనులు:
*ఈ సమయంలో శుభకార్యాలు అనగా మంచి పనులు చేయడం వల్ల త్వరగా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది .ఆ సమయంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

* బ్రహ్మ ముహూర్తం గ్రంథాల ద్వారా మాత్రమే కాకుండా ఆధునిక మరియు ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ సమయం ముఖ్యమైనదిగా గుర్తించబడింది .ఈ సమయంలో లేచి చదువుకోవడం వల్ల వారు చదివిన పాఠాలు మరియు విషయాలు, చాలా బాగా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. అందుకే మన పెద్దలు పిల్లల్ని తెల్లవారుజామున లేచి చదవమని చెప్తుంటారు.

చేయకూడని పనులు:
ఈ సమయంలో మర్చిపోయి కూడా ఆహారం తీసుకోకూడదు. ఆహారం తినడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు మరియు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో తినడం అంత శ్రేయస్కరం కాదు .

Today Rashi Phalam: నేటి రాశి ఫలం, డైలీ జాతకం 27-జూలై-2023
*ఈ ముహూర్తాన్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి. ఈ సమయం పవిత్రమైన సమయం. భగవంతుని ఆరాధించే సమయం కాబట్టి ఈ సమయంలో దాంపత్య సంబంధ పనులు చేయకూడదు.
కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి స్నానం, పూజ, ధ్యానం, చదువు ,వాకింగ్, జీవితం పట్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి మంచిపనులు చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయం ను సద్వినియోగం చేసుకొని శుభ ఫలితాలను పొందవచ్చు .

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in