Breast and Cervical Cancer : ప్రాణాంతక వ్యాది కాన్సర్ ను నివారించడంలో మహిళలకు చేదోడు ఈ పండ్లు, ఇది ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయం.
స్త్రీలలో సర్వైకల్ (Cervical) మరియు బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆహారంలో కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ద్వారా దీనిని కొంత మేరకు నివారించవచ్చని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు.
క్యాన్సర్ (Cancer) వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించబడుతుంది. ఇది అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలలో సర్వైకల్ (Cervical) మరియు బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
వంశపారంపర్యం తో పాటు జీవన విధానం సక్రమంగా లేకపోవడం మరియు ఆహారం (Food) తీసుకోవడంలో అవంతరాలు ఈ ప్రమాదాన్ని గణనీయంగా పెంచేలా చేశాయి. క్యాన్సర్ ను నిర్మూలించడానికి రోజు వారి దినచర్య సక్రమంగా ఉండాలి. మరియు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
స్త్రీల (Women) ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ల నుండి కాపాడే పండ్లను పరిశోధకులు కనుగొన్నారు.క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని కొంతవరకు నిరోధించవచ్చు అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం.
బొప్పాయి:
బొప్పాయిలో లైకోపీన్ (Lycopene) సమృద్ధిగా ఉందని పరిశోధనలో తేలింది. ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ (Anti oxidant) . ఇది రొమ్ము మరియు గర్భాశయం క్యాన్సర్ ప్రమాదాల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. బొప్పాయితో పాటు టొమాటో, క్యారెట్ మరియు పుచ్చకాయల లో కూడా లైకోపీన్ ఉంటుంది .
బొప్పాయి పండును తీసుకోవడం వల్ల గుండె( Heart) సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడడంలో సహాయపడటంతో పాటు బీపీ (Blood Pressure) మరియు కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మహిళలందరూ తమ ఆహారంలో బొప్పాయి పండు ఉండేలా చూసుకోవాలి.
Also Read : దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు
నారింజ:
నారింజపండు సిట్రిక్ (Citric) పండు. దీనిలో విటమిన్- c సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్- సి తో పాటు మరియు పొటాషియం (Potassium) వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తి ని పెంచడంలో విటమిన్-C ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో వేగంగా కోలుకోవడంలో సహాయపడుతుంది.
ద్రాక్ష :
క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించే పండ్లలో ద్రాక్ష ఒకటిగా చెప్పవచ్చు. ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు (Vitamins), ఖనిజాలు (Minerals) సమృద్ధిగా ఉన్నాయి. ద్రాక్షలో ఉండే విటమిన్ -C, ప్రో విటమిన్- A మరియు పొటాషియం ఉండటం వల్ల చాలా కఠినమైన వ్యాధుల ఇబ్బందుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇదే కాకుండా లైకోపీన్ కెరోటినాయుడ్ లను కలిగి ఉండడం వల్ల క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలను కలిగి ఉంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న రోగులకు ద్రాక్ష పండ్లు చాలా బాగా సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
Also Read : అత్తిపండుతో అధిక బరువు హాం ఫట్..అంజీర్ చేసే లాభాలు ఇంకా మరెన్నో
ఆపిల్:
అత్యంత ప్రచారం పొందిన పండ్లలో యాపిల్ ఒకటి. ఆపిల్ లో ఫైబర్ (Fiber) అధికంగా ఉంటుంది. మరియు దీనిలో పొటాషియం, విటమిన్- C కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుండి మనల్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయి. ఆపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ప్రేగు (Intestine) కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం ద్రవసమతుల్యతను సరి చేయడంలో సహాయపడుతుంది. మరియు కాన్సర్ ప్రమాదాలను నిర్మూలించడంలో కూడా ఉపయోగపడుతుంది.
కాబట్టి ముఖ్యంగా మహిళలు రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే రోజువారి ఆహారంలో ఈ పండ్ల (Fruits) ను చేర్చుకోవడం ముఖ్యం.
Comments are closed.