Telugu Mirror : టెన్నిస్ ను అభిమానించే వారికి పరిచయం అక్కర లేని పేరు రోజర్ ఫెడరర్. స్విట్జర్లాండ్ కి చెందిన ఈ దిగ్గజ ఆటగాడు టెన్నిస్ లో ఎదురులేని ప్లేయర్ గా గుర్తింపు సాధించాడు. గ్రాస్ కోర్ట్ దిగ్గజం ఫెడరర్ ఖాతాలో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో అత్యధికంగా 8 వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. వింబుల్డన్ టోర్నీ గ్రాస్ కోర్ట్ లోనే జరుగుతుంది. ఈ స్విస్ ఆటగాడికి వింబుల్డన్ అంటే మక్కువ.
తన సాటి ఆటగాళ్ళు రఫెల్ నాదల్,నొవాక్ జకోవిచ్ లతో పోటీపడి మరీ టైటిల్స్ ను సాధించిన ఫెడరర్ ఆటకు వయసు భారంగామారడం,గాయాల సమస్యలు వేధిస్తుండడంతో 2022 లో టెన్నిస్ కు గుడ్ బై చెప్పాడు. టెన్నిస్ కి వీడ్కోలు పలికినప్పటి నుండి ఇంటర్నేషనల్ టెన్నిస్ అసోసియేషన్ కి ఫెడరర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ కు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అయితే జూలైలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో భాగంగా నిర్వహిస్తున్న ప్రమోషన్ లలో తాజాగా బాల్ బాయ్స్ మరియు బాల్ గర్ల్స్ తో సరదాగా గడిపాడు ఈ సొగసరి టెన్నిస్ ఆటగాడు.
Smartphone: రూ.20 వేల లోపు టాప్-5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
అదే సమయంలో బ్రిటన్ యువరాణి, ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ కేట్ మిడిల్ టన్ వింబుల్డన్ కోర్ట్ లోకి రాగా తనతో టెన్నిస్ ఆడాలని ఫెడరర్ యువరాణి మిడిల్ టన్ ను ఆహ్వానించాడు.ఫెడరర్ పిలుపు మేరకు యువరాణి కాసేపు ఫెడరర్ తో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో బాల్ సరిగ్గా లైన్ మీద పడటంతో మ్యాచ్ లో యువరాణి ఒక పాయింట్ కూడా సాధించారు. యువరాణి పాయింట్ సాధించడంతో ‘అమేజింగ్’ అంటూ ఫెడరర్ అభినందించారు. యువరాణి కేట్ మిడిల్ టన్ కొద్దిసేపు బాల్ గర్ల్ గానూ వ్యవహరించారు. అయితే ఆమె కొన్ని నిభంధనలను మర్చిపోవడంతో, బాల్ గర్ల్ బంతి బౌన్స్ అయిన తరువాతనే మనం అందుకోవాలి అంటూ ఆమెకు సలహా ఇచ్చింది.
Paytm: పేటీఎం కొత్త ఫీచర్.. ‘పిన్ రీసెంట్ పేమెంట్స్’ ఫీచర్ లాంచ్..
యువరాణి అడగటంతో టెన్నిస్ లో మెళకువలు నేర్పించిన ఫెడరర్ ఇది సరైన ప్రాక్టీస్,నేను ఇంప్రెస్ అయ్యాను అంటూ పేర్కొన్నాడు. అయితే ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ రాయల్ పోషకురాలిగా ఉన్న బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్ టన్ వింబుల్డన్ లోని రాయల్ బాక్స్ లో నిత్యం కనిపిస్తుంటారు. ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.