Gold and Silver Rate : ఈ మధ్య కాలంలో పెరిగి పసిడిప్రియులను షాక్ కి గురి చేసిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. దింతో బంగారాన్ని కొనాలనుకునేవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సీజన్‌తో సంబంధం లేకుండా భారతీయులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పండుగలు, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల చుట్టూ బంగారం (Gold) కొనుగోళ్లు పెరుగుతాయి. బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో గణనీయమైన లాభాలు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఆపద సమయంలో బంగారం కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 మరియు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 10, తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 72,640 వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 10, తగ్గింది రూ. 66,590 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలోనూ ఇదే ధర వర్తిస్తుంది.
దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,640 మరియు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ప్రస్తుతం రూ. 66,590. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,790 అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,740 వద్ద ట్రేడవుతోంది.
పసిడితో పాటు వెండి ధరలు పతనమయ్యాయి. కొద్దిరోజుల క్రితం బంగారంలానే వెండికి కూడా గిరాకీ ఎక్కువైంది. దీంతో కిలో వెండి లక్ష రూపాయలకు మించి పలుకుతుందా అని కొందరు ప్రశ్నించారు. ప్రస్తుతం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలోవెండి నేడు 100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 100, తగ్గి రూ. 96,100 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడ, ముంబై, చెన్నై నగరాల్లో కూడా ధరలు అలాగే ఉన్నాయి. హస్తినలో కిలో వెండి ధర రూ. 91,600 వద్ద ట్రేడవుతోంది.