Gold Rates Today 05-04-2024 : బంగారం ప్రియులకు మళ్ళీ షాకింగ్ న్యూస్. పెరుగుతున్న బంగారం ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు బంగారం కొనాలనుకున్న కూడా రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి కాబట్టి దేశీయంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హమ్మయ్య అనుకునేలోపే మళ్ళీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తులం గోల్డ్ పై ఎంత తగ్గింది, పెరిగింది అనే విషయం గురించి తెలుసుకుందాం.
ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరుగుదల చోటుచేసుకుంది. ఇటు వెండి విషయానికి వస్తే, కిలో వెండిపై రూ.100 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..!
- తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
- ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,610 వద్ద నమోదయింది.
- ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,480 వద్ద నమోదయింది.
దేశ నగరాల్లో ధరలు ఇలా..!
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,760 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,630 వద్ద కొనసాగుతుంది.
- ముంబైలో గోల్డ్ ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,760 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,630 వద్ద నమోదయింది.
- కోల్కతా, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,610 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,630 వద్ద నమోదయింది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,460 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,480 వద్ద నమోదయింది.
వెండి ధరలు నేడు ఇలా..!
వెండి ధర దేశ వ్యాప్తంగా పెరిగింది. దేశ ప్రధాన నగరాల్లో మరియు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
- తెలంగాణలోని హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.85,400 వరకు చేరుకుంది.
- విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 85,400 వద్ద నమోదయింది.
- దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.82,100 మార్కును చేరుకుంది.
- కోల్కతాలో కిలో వెండి ధర రూ.82,100 వద్ద నమోదయింది.
- చెన్నైలో కిలో వెండి ధర రూ. 84,100 నమోదయింది.