Gold Rates Today 16-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? అయితే బంగారం కొనాలనుకునే వారికి ఈ షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధర బాగా తగ్గగా ఒక్కసారిగా బంగారం ధర పెరిగిపోయింది.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరగ్గా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 వరకు పెరుగుదల చోటుచేసుకుంది. ఇక కిలో వెండిపై రూ.1000 వరకు పెరుగుదల చోటుచేసుకుంది.
దేశంలో ప్రధాన నగరాల్లో Gold Rates Today 16-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 250 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,440 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,290గా నమోదయింది.
చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600, 24 క్యారట్ల బంగారం ధర రూ.62, 840 వద్ద నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండిపై రూ.1000 పెరగడంతో దాంతో అక్కడ ధర రూ.77,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,600 వద్ద నమోదయింది,
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,100 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,290గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.