Gold Rates Today 28-03-2024 : వామ్మో.. మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు, ధర ఎంతో తెలుసా..?

Gold Rates Today 28-03-2024

Gold Rates Today 28-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గతంలో కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, గత కొన్ని  రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. ఈరోజు బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380పెరిగి.. రూ.61,700 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67,310గా నమోదయింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 28-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61, 850 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,460 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.61,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,930గా నమోదయింది. చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.61,700, 24 క్యారట్ల బంగారం ధర రూ.67,310 వద్ద నమోదయింది.

Gold Rates Today 26-03-2024

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.80,500 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో వెండి  ధర రూ.77,500 వద్ద నమోదయింది. బెంగుళూరులో రూ.75,900 నమోదు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,930గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in