Telugu Mirror : బంగారం కొనాలనుకుంటున్నారా? బంగారం ప్రియులకు కొంచం ఊరట లభించిందనే చెప్పాలి. ఈ మధ్య బంగారం, వెండి ధరల్లో ఎచ్చుతగ్గులను మనం చూస్తూ ఉన్నాం. గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలపై ఎటువంటి మార్పు లేదు. ఈ రెండు రోజులు స్థిరంగా ఉంది. మరి ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…ఈరోజు కూడా బంగారంలో ఎటువంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800కి నమోదయింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,050గా నమోదయింది. ఇక వెండి విషయానికి ఈరోజు భారీగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.76,500 వద్ద కొనసాగుతుంది.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 950 నమోదు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,200 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050 నమోదయింది.
ఇక చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేట్ నిన్నటిలాగే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300 కు నమోదయింది. 24 క్యారెట్ల బంగారం రూ. 63,600వద్ద కొనసాగుతుంది.
Also Read : Gold Rates Today : బంగారం కొనుగోలు చేయాలా? ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
వెండి ధరలు ఇలా ఉన్నాయి :
దేశ ప్రధాన నగరాలు అయినా ముంబై, కోల్కతా, ఢిల్లీ లో వెండి ధర పరిశీలించినట్లయితే, వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి ధర రూ.75,000లకు నమోదు కాగా, చెన్నై లో రూ.76,500 కాగా, బెంగుళూరులో నిన్నటిలాగా రూ.73,000 వద్ద నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో బంగారం ధరపై మార్పులు ఏమి లేవు. ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.63,050 గా నమోదయింది. వెండి ధర రూ.500 తగ్గి రూ.76,500 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.