Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ఎంతో తెలుసా?

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.58,100 వద్ద నమోదయింది. అలాగే 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.63,380గా నమోదయింది. కిలో వెండి రూ.77,000 వద్ద కొనసాగుతుంది.

Telugu Mirror : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఈ మధ్య హెచ్చుతగ్గులు ఎక్కువ అయ్యాయి. మరి ఈరోజు బంగారం ధర పెరిగిందా లేక తగ్గిందా అనే విషయాన్ని ఇప్పుడు  తెలుసుకుందాం. ఈరోజు  బంగారం పై ఎటువంటి తగ్గింపు లేదు, స్థిరంగా ఉంది. ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.58,100 వద్ద నమోదయింది. అలాగే 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.63,380గా నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై నిన్న రూ.1000 వరకు తగ్గింది.ఈరోజు ఏ మార్పులు చోటుచేసుకోలేదు. వెండి కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి రూ.77,000 వద్ద కొనసాగుతుంది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 250 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,530 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,380 నమోదయింది.

Gold Rates Today : Want to buy gold? How much is 10 grams of gold in Telugu states?
Image Credit : The Hans India

Also Read : Gold Rates Today : బంగారం కొనేవారికి గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా?

ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700 నమోదయింది. మరి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,040 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ.77,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,500 వద్ద నమోదయింది, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.2,500 పెరగడంతో రూ. 75,500 గా నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర స్థిరంగా ఉంది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,100 నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,380 గా నమోదయింది. కిలో వెండి రూ.77,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.