Petrol Diesel Update 2024: ఈ రోజుల్లో ఖర్చులు అధికంగా పెరుగుతున్నాయి. చిన్న వస్తువుల నుండి పెద్ద వస్తువుల వరకు రేట్లు అదిరిపోతున్నాయి. మన ఇంట్లోని నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అసలు ఎందులోనూ ధరలు తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాహనదారులకు పీఎం గుడ్ న్యూస్
ఎన్నాళ్ళ నుండో పెట్రోల్ ధర 100కు తగ్గలేదు.. అయితే ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వాహనదారులకు శుభవార్త అందించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత.. అతి త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు.
ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పథకం అమలులో ఉంటుంది
6జీ టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశాన్ని ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. భారత్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మోదీ వెల్లడించారు. పార్టీ మేనిఫెస్టో కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూడటం వెనుక ఉన్న కారణం.. “10 సంవత్సరాలలో, బిజెపి తన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని హామీ ఇచ్చింది” అని ప్రధాని అన్నారు. వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్ పథకం అమలులో ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. పేదలకు పౌష్టికాహారం అందుబాటు ధరలో ఉండేలా చూస్తాము” అని ప్రధాన మంత్రి అన్నారు.
బీజేపీ హయాంలో అభివృద్ధి, సంస్కృతి రెండిటికీ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఏజెన్సీలో పర్యాటకాన్ని ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. సామాజిక, డిజిటల్ మరియు భౌతిక రంగాలలో మౌలిక సదుపాయాలను పెంచుతాము.
దేశంలో చాలా చోట్ల శాటిలైట్ టౌన్‌లు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో మూడు రకాల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి రైళ్లు నడుస్తున్నాయి అని ప్రధాని మోదీ అన్నారు.
Petrol Diesel Update 2024