Reliance Home Delivery: క్విక్ కామర్స్ లోకి రిలయన్స్, ఇక అర్దగంటలో మీ ఇంటికి డెలివరీ

రిలయన్స్ రిటైల్ ఇప్పుడు 30 నిమిషాల్లో కస్టమర్ల ఇళ్లకు వస్తువులను డెలివరీ చేసేవిధంగా ప్లాన్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

Reliance Home Delivery: ఈరోజుల్లో ఏదైనా వస్తువు కొనలంటే దుకాణాలకు వెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ప్రతిదీ ఆన్‌లైన్‌ (Online) లో ఆర్డర్ లోనే చేసుకుంటున్నారు. ఇంట్లో ఉండే బుక్ చేసుకుంటే చాలు, ఇక నేరుగా కావాల్సిన వస్తువులు ఇంటికే డెలివరీ అవుతాయి.

అతి తక్కువ సమయంలోనే డెలివరీ అవ్వడంతో కస్టమర్ల సమయం కూడా ఆదా అవుతుంది. Swiggy Instamart, Blinkit, Zepto మరియు Beebenow ఇప్పటికే ముఖ్యమైన ఉత్పత్తులను డెలివరీ చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కూడా క్విక్ కామర్స్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

దీనికి సంబంధించి రిలయన్స్ రిటైల్ (Reliance Retail) కూడా ఒక టీమ్ ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. జియో మార్ట్ (Jio Mart) పేరుతో కరోనా సమయంలో రిలయన్స్ ముఖ్యమైన వస్తువుల డెలివరీ పరిశ్రమలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, రిలయన్స్ రిటైల్ ఇప్పుడు 30 నిమిషాల్లో కస్టమర్ల ఇళ్లకు వస్తువులను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఫైండ్ మరియు లోకస్ వంటి టెక్నాలజీని ఉపయోగించి ఫాస్ట్ రూట్లలో 30 నిమిషాల్లో డెలివరీ చేసేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: JIO 26 Recharge: రూ.26 రీఛార్జ్ తో 28 రోజుల వ్యాలిడిటీ, జియో నుండి సూపర్ ప్లాన్

రిలయన్స్ జియో మార్ట్ తన సొంత స్టోర్‌లు మరియు వాటి నుండి కొనుగోలు చేసే వాటి నుండి ఉత్పత్తులను సేకరించి, ఆపై వాటిని కస్టమర్‌లకు డెలివరీ (Delivery) చేయాలని భావిస్తోంది. జియో మార్ట్ పార్టనర్‌ (JIO MART Partner) లో భాగంగా, రిలయన్స్ రిటైల్ హోల్ సేల్ విభాగం నుండి 20 లక్షల కిరాణా దుకాణాదారులు కొనుగోలు చేస్తున్నారు.

జూన్‌లోనే రిలయన్స్ క్విక్ కామర్స్ సేవలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. కంపెనీ మొదటగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణె, హైదరాబాద్ మరియు కోల్‌కతాలో ఈ సర్వీసెస్ ను అందించనుంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. వాటిని జియో మార్ట్ ఎక్స్‌ప్రెస్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది Jiomart యాప్‌లోనే భాగం అవుతుంది. రిలయన్స్ 2023లో ప్రయోగాత్మకంగా ముంబైలో క్విక్ కామర్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలం తర్వాత ఈ సేవలను నిలిపివేశారు. రిలయన్స్ మరోసారి క్విక్ కామర్స్‌ లోకి ప్రవేశించి, 30 నిమిషాల్లో వినియోగదారులకు వస్తువులను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

Comments are closed.