Calm And Silence : రోజు ఒక గంట నిశ్శబ్దంగా.. ప్రశాంతంగా గడపండి అద్భుతమైన శారీరక, మానసిక ప్రయోజనాలను పొందండి
ప్రతిరోజు ఒక గంట సేపు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండటం వల్ల శరీరంలోకి ఒక అద్భుతమైన శక్తి వస్తుందని తాజాగా చేసిన పరిశోధనలలో తేలింది. ప్రతిరోజు ఒక గంట సేపు నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రతిరోజు ఒక గంట సేపు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండటం వల్ల శరీరంలోకి ఒక అద్భుతమైన శక్తి (Awesome power) వస్తుందని తాజాగా చేసిన పరిశోధనలలో తేలింది.
ప్రతిరోజు ఒక గంట సేపు మౌనంగా ఉండడం వల్ల నిశ్చలత (stillness), స్థిరత్వం, ఏకాగ్రత, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతాయి. దీనివల్ల మానసికంగా మరియు శారీరకంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతిరోజు ఒక గంట సేపు నిశ్శబ్దం (silence) గా మరియు ప్రశాంతంగా ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఒత్తిడి దూరం అవుతుంది:
ప్రతిరోజు ఒక గంట సేపు ఎటువంటి విషయాలు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపడం వల్ల ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి, భయం మొదలైన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు. తద్వారా ఒత్తిడి (stress) తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం:
ప్రతిరోజు ఒక గంట మౌనంగా మరియు ప్రశాంతంగా ఉండడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలలో తేలింది. ప్రతిరోజు ఒక గంట నిశ్శబ్దంగా ఉండడం రక్త ప్రసరణ (blood circulation) కూడా బాగా జరుగుతుంది.
Also Read : Role Of Aspirin: రెండవ సారి హార్ట్ స్ట్రోక్ నివారణలో ఆస్పిరిన్ పాత్ర
క్రియేటివిటీ:వల్ల మనలో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అందుకే కళాకారులు, రైటర్స్ చాలా వరకు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ప్రశాంతంగా ఉండడం వలన సృజనాత్మకత (Creativity) పెరిగే అవకాశం ఉంది.
కమ్యూనికేషన్ స్కిల్స్:
ప్రతిరోజు ఒక గంట సేపు నిశ్శబ్దంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. నిశ్శబ్దంగా ఉండడం వలన మాట్లాడే ప్రతి మాట మరింత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. అవగాహన, సానుభూతి (sympathy) పెంచుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది.
నాణ్యమైన నిద్ర:
ప్రతిరోజూ ఒక గంట నిశ్శబ్దంగా ఉండడం వల్ల నిద్ర మెరుగు పెడుతుంది. మంచిగా నిద్రపోవడం వల్ల మనసు మరియు శరీరం రెండు రిఫ్రెష్ అవుతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి (Immunity) కూడా పెరుగుతుంది.
రక్తపోటు,
బిపి:
ప్రతిరోజు ఒక గంట సేపు మౌనంగా ఉండటం వల్ల బీపీ వంటి సమస్యలు రావడం కూడా తగ్గుతాయి. బిపి కంట్రోల్ లో ఉంటుంది. దీనివల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి.
కాబట్టి ప్రతిరోజు, ప్రతి ఒక్కరు, ఒక గంట సేపు నిశ్శబ్దంగా, ప్రశాంతం (calm) గా గడపడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Comments are closed.