Telugu Mirror :నవంబర్ 20న, AILET 2024 లేదా ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ (All India Law Entry Test) కోసం నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ (NLU) అడ్మిషన్ కార్డ్‌లను రేపు రిలీజ్ చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్ అయిన, nationallawuniversitydelhi.inలో దరఖాస్తుదారులందరికీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కాల్ లెటర్‌లు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, గౌహతి, బెంగళూరు, బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), భోపాల్, చండీగఢ్, చెన్నై, కొచ్చిన్, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, గాంధీనగర్, ఘజియాబాద్‌తో సహా అనేక ప్రదేశాలతో పాటు మధురై, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పూణే, రాయ్‌పూర్, రాంచీ, తిరువనంతపురం, సిమ్లా, సిలిగురి, వారణాసి మరియు విశాఖపట్నంలో డిసెంబర్ 10న, ప్రవేశ పరీక్ష జరుగుతుంది. . పరీక్ష నగరం మరియు ఇతర వివరాలు దరఖాస్తుదారులకు వారి అడ్మిషన్ కార్డులు విడుదలయిన తర్వాత కనిపిస్తాయి. NLU ఢిల్లీ యొక్క BA-LLB(ఆనర్స్), LLM మరియు PhD ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం ఆన్‌లైన్ పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి నవంబర్ 15 చివరి తేదీ అనే విషయం తెలిసిందే.
ఒక నగరంలో 100 మంది కంటే తక్కువ అభ్యర్థులు ఉంటే పరీక్ష కేంద్రాలను పెట్టరు. దానికి బదులుగా, ఆ అభ్యర్థులు వారి రెండవ లేదా మూడవ ఎంపికలకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలకు కేటాయించబడతారు.
బర్త్ డేట్, రోల్ నెంబర్ మరియు ఇతర సమాచారాన్ని అక్కడ నమోదు చేయండి.
AILET 2024 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
తర్వాత ఉపయోగం కోసం AILET 2024 అడ్మిట్ కార్డ్‌ని మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి. మరియు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి.
AILET 2024 పరీక్ష షెడ్యూల్
LLB మరియు LLM కోర్సుల కోసం, AILET 2024 పరీక్ష 120 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. LLB కోర్సులో 150 ప్రశ్నలు ఉంటాయి, LLM కోర్సులో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఖచ్చితమైన ఆన్సర్ కి ఒక మార్కు వస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు మైనస్ అవుతాయి.
పాటించాల్సిన నియమాలు
అభ్యర్థులు కనీసం ఒక గంట ముందుగా పరీక్షా ప్రదేశానికి చేరుకోవడం ముఖ్యం. పరీక్ష రోజున, అభ్యర్థులు తప్పనిసరిగా తమ కాల్ లెటర్‌లు మరియు పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వంటి చట్టబద్ధమైన ఫోటో IDని తీసుకురావాలి. OMR ఆన్సర్ పత్రాన్ని పూర్తి చేయడానికి అభ్యర్థులు పెన్నులు మరియు HB పెన్సిల్ తీసుకొని వెళ్ళాలి. పరీక్ష అనుభవం కోసం నలుపు మరియు నీలం పెన్నులను ఉపయోగించడం మంచిది.