Indian Bank Jobs 2024 : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 146 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 1 వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీ వివరాలు :
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) 146
అర్హత :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి CA/CWA/ ICWA, డిగ్రీ, PG / డిప్లొమా కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము :
SC/ST/PWBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 175. మిగతా వారికీ దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్‌లు/క్రెడిట్ కార్డ్‌లు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 12-03-2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 01-04-2024
వయోపరిమితి (01-01-2024 నాటికి) :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది
ఎంపిక ప్రక్రియ :
ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అనుభవం, అర్హత మరియు పనితీరు ఆధారంగా ఈ పోస్టులకు తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్యానల్ ఎంపిక చేస్తుంది.
Indian Bank Jobs 2024