Job Update : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మరింత కష్టపడి చదవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగం సాధించాలంటే ప్రణాళికతో కూడిన చదువు, నైపుణ్యాలు కలిగి ఉండాలి. పోటీ పెరుగుతున్న కొద్దీ నిరుద్యోగులు కూడా ఎక్కువవుతున్నారు. అయితే, నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (Assistant Statistical Officer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మర్చి 6న విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. మే 8న ఈ దరఖాస్తు ప్రక్రియ ముగియగా . అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య : 5
దరఖాస్తుకు ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభ తేదీ : 18-04-2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08-05-2024
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్) లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో (గణితం, ఆర్థిక శాస్త్రం, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్) స్టాటిస్టిక్స్ సబ్జెక్ చదివి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ (online) ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి : జూలై 1, 2024 నాటికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 మరియు 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోపరిమితి సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. పీడబ్ల్యుడీ అభ్యర్థులకు మరో 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
పరీక్ష ఫీజులు : ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు, మాజీ సైనికులు, రేషన్ కార్డులు కలిగిన దరఖాస్తుదారులకు రూ.250 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. మిగిలిన వారు దరఖాస్తు చేసుకునేందుకు రూ.370 చెల్లించాలి.
పరీక్ష విధానం : పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ప్రతి పేపర్ లో 150 ప్రశ్నలు 150 మార్కులు (Marks) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్ అవుతాయి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ మార్కులు ఫైనల్ సెలక్షన్ (Final Selection) లోకి పరిగణలోకి తీసుకోరు.
జీతం : ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.37,640 మరియు రూ.1,15,500 మధ్య పొందుతారు.
ఎంపిక ప్రక్రియ : వ్రాత పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.