కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) దేశవ్యాప్తంగా IB పరిధిలోని సబ్సిడియరి ఇంటిలిజెన్స్ బ్యూరో ల్లో నేరుగా రిక్రూట్ మెంట్ పద్ధతిన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల (ACIO) భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ క్రింద మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల (Assistant Central Intelligence Officer Posts) ను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 15వ తేదీ లోపల అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : విద్యార్థి వీసా దరఖాస్తు ప్రక్రియలో యుఎస్ ఎంబసీ చేసిన స్వల్ప మార్పులు, నవంబర్ 27 నుండి అమలులోకి
ఖాళీ పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 995 ఉన్నాయి.
వీటిలో ఉన్న పోస్టుల కేటగిరి వివరాలు :
జనరల్ కేటగిరి – 377
ఈడబ్ల్యూఎస్ కేటగిరి – 129
ఓబీసీ కేటగిరి – 222
ఎస్సీ కేటగిరి – 134
ఎస్టీ కేటగిరి – 133 పోస్ట్ లు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు (Application) చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వారి వయస్సు డిసెంబర్ 15 – 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్న అభ్యర్థులు (Candidates) అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 550 రూపాయలు చెల్లించాలి.
టైర్ -1 రాతపరీక్ష
టైర్ -2 పరీక్ష
టైర్ -3 ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం నెలకు 44,900 నుండి 1,42,400 వరకు చెల్లిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్న జిల్లాలు :
అనంతపురం, గుంటూరు, చీరాల, కర్నూలు, కడప, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం , మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో (districts) కేటాయిస్తారు.
రాత పరీక్ష విధానం :
టైర్ -1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
టైర్ -2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
Also Read : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్, SBI నుండి క్లర్క్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులు, ఇప్పుడే అప్లై చేసుకోండి
పరీక్షలో ఉండే అంశాలు :
జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ /లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ వీటిల్లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు కేటాయిస్తారు.
పరీక్ష సమయం ఒక గంట ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి (Answer) నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
టైర్ -2 పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట (One Hour) ఉంటుంది.
టైర్ -2 పరీక్షలో
ఎస్సే, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది.
టైర్ -3 విభాగం క్రింద, 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : నవంబర్ -25 -2023
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ -15- 2023.
అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : డిసెంబర్ -19 -2023.
కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.