TS TET Application 2024 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ఆన్‌లైన్ దరఖాస్తులు నేటితో ముగుస్తాయి. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా చేసుకోవాలి. మార్చి 27న టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ప్రభుత్వం టెట్ దరఖాస్తు ఫీజులను రూ.1000 పెంచిన సంగతి తెలిసిందే. టెట్‌కి గతంలో ఒక్కో పేపర్‌కు రూ.200 చెల్లించగా, ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి రూ.1000కి పెంచారు. రెండు పేపర్లు చేసే దరఖాస్తుదారుల ధరను రూ.300 నుంచి రూ.2,000కు పెంచారు.
ఏప్రిల్ 19వ తేదీకి తెలంగాణ టెట్ కు దరఖాస్తులు 2.56 లక్షలకు పైన వచ్చాయి. కానీ గత సంవత్సరం నిర్వహించిన టెట్ పరీక్షకు 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి మాత్రం దరఖాస్తు దారులలో స్పందన అంతగా లేదు.
టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి
- టెట్ రాయడానికి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ‘Fee Payment’ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని దానిపై క్లిక్ చేసి నిర్ణయించిన ప్రకారం ఫీజును చెల్లించాలి.
- పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పైన క్లిక్ చేసి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా? లేదా అనేది తనిఖీ చేసుకోండి.
- తరువాత దశలో ‘Application Submission’ అనే లింక్ పైన నొక్కాలి.
- మీయొక్క వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో మరియు సంతకం తప్పకుండా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇలా అందులో ఉన్న అన్ని వివరాలను నమోదు చేశాక ఆఖరిలో ఉండే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
- ‘Print Application’ అనే ఎంపిక పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
- మీ యొక్క దరఖాస్తు రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా నమోదు చేసుకుని ఉంచుకోవాలి. హాల్ టికెట్లను జారీ చేసే సమయంలో హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు దరఖాస్తు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుతుంది.
టీఎస్ టెట్ 2024 దరఖాస్తుల సవరణ
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో తప్పులుంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు కోరారు. ఇందుకోసం వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎడిట్ ఆప్షన్‌ను ఉపయోగించి వెంటనే దరఖాస్తును సవరించాలని, ఈరోజు వరకే గడువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి ఎడిట్ చేశాక మరోసారి సవరించుకోడానికి వీలు లేదని అధికారులు పేర్కొన్నారు.
టీఎస్ టెట్ 2024 దరఖాస్తుల సవరణ విధానం :
- దరఖాస్తులను సవరించడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tstet2024.aptonline.inని సందర్శించాలి.
- హోమ్‌పేజీలో ‘Edit Application’ అనే ఎంపికను ఎంచుకోండి.
- ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత, అభ్యర్థులు తప్పనిసరిగా వారి జనరల్ నంబర్/పేమెంట్ రిఫరెన్స్ ID మరియు పుట్టిన తేదీని కొత్త పేజీలో నమోదు చేయాలి.
- వివరాలను నమోదు చేసిన తర్వాత, అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్ వివరాలలో ఏవైనా తప్పులుంటే సరిచేయండి.
- వివరాలను సర్దుబాటు చేసిన తర్వాత, ‘సబ్మిట్’ బటన్‌ను క్లిక్ చేయండి.
- మరోసారి, కొత్త దరఖాస్తును డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి
టీఎస్ టెట్ 2024 ముఖ్య తేదీలు :
- తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 20, 2024.
- హాల్ టికెట్లు జారీ – మే 15, 2024.
- పరీక్షలు ప్రారంభ తేదీ – మే 20, 2024.
- పరీక్షల ముగింపు తేదీ – జూన్ 06,2024.
- టెట్ ఫలితాలు వచ్చేది – జూన్ 12, 2024.