TS TET registration date extended useful news : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష Teacher Eligibility Test (టెట్-TET) దరఖాస్తుల(TS TET Applications) గడువు ఈరోజుతో ముగుస్తున్న సమయంలో విద్యాశాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. టెట్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన టెట్ కు వచ్చిన స్పందన ఈసారి అభ్యర్థుల నుంచి పెద్దగా రాలేదు. అంతేకాకుండా ఈసారి ఫీజు కూడా అభ్యర్ధులకు భారంగా మారింది.
ఏప్రిల్ 9వ తేదీకి తెలంగాణ టెట్ కు దరఖాస్తులు లక్షా 90వేలకుపైన మాత్రమే వచ్చాయి. కానీ గత సంవత్సరం నిర్వహించిన టెట్ పరీక్షకు 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి మాత్రం దరఖాస్తు దారులలో స్పందన అంతగా లేదు. ఇదిలావుండగా ఇంతకముందు ఒక్క పేపర్ రాసేందుకు రూ. 200 ఫీజు చెల్లిస్తే సరిపోయేది. కానీ,ఇప్పుడు ఈ రుసుము ఏకంగా నాలుగింతలు పెరిగి ఒక్క పేపర్ కు ఫీజు రూ. 1000 కట్టాల్సి వస్తోంది.
రెండు పేపర్లు కు దరఖాస్తు చేసుకోవాలంటే రూ. 2వేలు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఒకరకంగా ఫీజు భారం అధికంగా ఉన్నందు వలనే ఎక్కువగా అభ్యర్ధులు దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నట్లుగా కూడా భావిస్తునారు. ఫీజు భారం అధికంగా ఉన్నందున కొంచం తగ్గించాలని ప్రభుత్వానికి పలువురు విజ్ఞప్తి చేసినాగానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
అదే సమయంలో పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం టెట్ అప్లికేషన్ల గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించింది. అలాగే రేపటి నుంచి 20వ తేదీ వరకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. టెట్ రాసే అభ్యర్ధులకు మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి
- టెట్ రాయడానికి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేచేసుకోవడానికి https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Fee Payment అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని దానిపై క్లిక్ చేసి నిర్ణయించిన ప్రకారం ఫీజును చెల్లించాలి.
- పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పైన క్లిక్ చేసి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా? లేదా అనేది తనిఖీ చేసుకోండి.
- తరువాత దశలో Application Submission అనే లింక్ పైన నొక్కాలి.
- మీయొక్క వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో మరియు సంతకం తప్పకుండా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇలా అందులో ఉన్న అన్ని వివరాలను నమోదు చేశాక ఆఖరిలో ఉండే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
- Print Application అనే ఎంపిక పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
- మీ యొక్క దరఖాస్తు రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా నమోదు చేసుకుని ఉంచుకోవాలి. హాల్ టికెట్లను జారీ చేసే సమయంలో హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు దరఖాస్తు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుతుంది.
టీఎస్ టెట్ 2024 ముఖ్య తేదీలు:
- తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 20, 2024.
- హాల్ టికెట్లు జారీ – మే 15, 2024.
- పరీక్షలు ప్రారంభ తేదీ – మే 20, 2024.
- పరీక్షల ముగింపు తేదీ – జూన్ 06,2024.
- టెట్ ఫలితాలు వచ్చేది – జూన్ 12, 2024.
- అధికారిక వెబ్ సైట్ – https://schooledu.telangana.gov.in/ISMS