Case Filed On Apple: యాపిల్ ఫోన్ కొంప ముంచింది, యాపిల్ పై రూ.53కోట్లుకు దావా!
ఐఫోన్ వల్ల కాపురం కూలిపోయిందని.. లండన్ కు చెందిన ఓ వ్యక్తి యాపిల్ పై కోట్ల రూపాయల దావా వేశాడు. వివరాల్లోకి వెళ్తే..
Case Filed On Apple: మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియా (Social Media) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా కారణంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం వల్ల చాలా మందికి పర్సనల్ లైఫ్ (Personal Life) అనేది లేకుండా పోయింది. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని ఇంటి గుట్టు బయట పెట్టుకొని గందరగోళం చేసుకుంటున్నారు.
సోషల్ మీడియా జీవితాలను నాశనం చేయడమే కాదు, దాంపత్య సమస్యలను కూడా కలిగిస్తోంది. చాలా మంది విడాకులకు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలే కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాపిల్ ఫోన్ (Apple Phone) తన జీవితాన్ని నాశనం చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. యాపిల్‌పై 53 కోట్ల రూపాయలకు దావా వేశారు.
Also Read:Battle of Rama and Ravana : రామ, రావణ యుద్ధం తర్వాత వానర సైన్యం ఎటు పోయిందో తెలుసా?
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తన ఐఫోన్ వల్ల కాపురం కూలిపోయిందని.. లండన్ (London) కు చెందిన ఓ వ్యక్తి యాపిల్ పై కోట్ల రూపాయల దావా వేశాడు. ఏం జరిగిందంటే. లండన్‌లోని ఓ వ్యాపారవేత్త యాపిల్ ఐమ్యాక్ (Apple Imac) ని ఉపయోగించి వేశ్యలతో చాట్ చేశాడు. చాట్ చేసిన తర్వాత ఆ మెసేజెస్ ను డిలీట్ చేశాడు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఈ మెసేజ్ లు అతని భార్య కంట పడ్డాయి. ఆ మహిళ అతనికి విడాకులు ఇచ్చింది. వ్యాపారవేత్త తన భార్యకు తెలియకుండా ఫోన్లో వ్యభిచారిణులతో అదే రాసలీలలు నడిపించాడు. ఈ వ్యవహారం పబ్లిక్‌గా మారకుండా ఉండేందుకు మెసేజ్‌లన్నింటినీ డిలీట్ చేశాడు.
అయితే, అతను తన ఐమ్యాక్‌లో అదే ఆపిల్ ఐడిని ఉపయోగించాడు. దాంతో, ఐఫోన్ నుండి టెక్స్ట్‌లు డిలీట్ చేసినప్పటికీ, అవి iMacలో ఉంటాయి. ఐఫోన్ నుండి డిలీట్ చేసిన మెసేజ్ లను iMacలో కనిపించాయి. ఒకరోజు, అతని భార్య ఆ మెసేజెస్ ను చూసింది. దీంతో ఆగ్రహించిన భార్య భర్తతో గొడవ పెట్టుకుంది. చివరికి విడాకుల కోసం దాఖలు చేసింది. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారిద్దరూ విడిపోయారు.
అయితే తన కాపురం కూలిపోడానికి యాపిల్ కారణమని భావించిన వ్యాపారవేత్త ఆ కంపెనీపై దావా వేశాడు. ఫోన్ నుండి టెక్స్ట్‌లను డిలీట్ చేస్తే, అవి శాశ్వతంగా డిలీట్ అవ్వాలి కదా..కానీ లింకు చేసిన ప్రతి డివైజ్ లో ఆ మెసేజ్ లు ఉండిపోతాయి అనే విషయాన్ని ఆపిల్ వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయలేదని ఆయన అన్నారు. ఒక్క పరికరంలో మెసేజ్ లు డిలీట్ అవుతాయని తెలిపితే, వినియోగదారులు జాగ్రత్తగా మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు అని ఆయన వెల్లడించారు. అయితే, ఈ సమస్యల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడంలో Apple కంపెనీ విఫలమైందని ఆయన ఆరోపించారు. దీని కారణంగా, అతను మరొక డివైజ్ లలో చేసిన మెసేజ్ లను అతని భార్య చూసినందు వల్ల విడిపోయారని తెలిపారు.
ఆపిల్ యొక్క నిర్లక్ష్యం కారణంగా, అతను 5 మిలియన్ పౌండ్లను కోల్పోయాడని, అంటే సుమారు భారత కరెన్సీలో రూ.53 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించారు. ఇందుకోసం యాపిల్ అతనికి రూ. 53 కోట్లకు కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు త్వరలోనే విచారించనుంది. మరి తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Comments are closed.