ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు. జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయింది. ఇప్పుడున్న కాలంలో జీవితంలో రాణించాలంటే సెల్ ఫోన్ ఖచ్చితంగా (Absolutely) ఉండాల్సిందే. స్కూల్ పిల్లలకు సైతం సెల్ ఫోన్ అవసరం అవుతుంది. స్మార్ట్ గా ఉండాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం పడుతుంది.
సెల్ ఫోన్ న్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. సెల్ ఫోన్ వల్ల పురుషులకు ఎక్కువగా నష్టం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే చాలామంది మగవారు (Males) సెల్ ఫోన్ ను వారు ప్యాంట్ జేబులో పెట్టుకుంటున్నారు.
ఈ మధ్య జరిగిన తాజా అధ్యయనం ప్రకారం పురుషులు ఎంత ఎక్కువగా సెల్ ఫోన్ వాడితే అంత తొందరగా శుక్రకణాల (sperm cells) సంఖ్య తగ్గిపోతుంది అని పరిశోధనలో తేలింది. ఫెర్టిలిటీ మరియు స్టెరిలిటీ జర్నల్ లో ప్రచురించబడిన తాజా నివేదిక ప్రకారం, సెల్ ఫోన్ ను అధికంగా ఉపయోగించడం వల్ల 20% సాంద్రత తక్కువగా కలిగి ఉంటారని వెల్లడించాయి.
సెల్ ఫోన్ నుండి విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాల హానికర ప్రభావం పురుషుల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి పని తీరుపై పడుతుంది అని పరిశోధకులు కనుగొన్నారు.
Also Read : బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ వాడుతున్నారా ?అయితే ఈ విషయాలు తెలుసుకోండి
18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్న 2886 మంది మగవారి వీర్యం సేకరించి పరీక్షలు జరిపారు. 20 సార్లు కంటే ఎక్కువగా సెల్ ఫోన్ వాడే వారిలో వీర్య కణాల సంఖ్య సాంద్రత (density) 21 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.
గత రోజుల కంటే ప్రస్తుత రోజుల్లో మగవారిలో వీర్యకణాల సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. ఎందుకనగా మొదట్లో 2g, 3g, 4g నెట్ వర్క్ ఉండేది. కానీ ఇప్పుడు 5g నెట్ వర్క్ కి మారడం వల్ల ఈ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మొబైల్ నెట్ వర్క్ లు ఆర్ ఎఫ్- ఈ ఎం ఎఫ్ అవుట్ పుట్ శక్తి కలిగి ఉన్నాయని వారు తెలిపారు.
కాబట్టి మొబైల్ ను ప్యాంటు జేబులో పెట్టడం వల్ల వీర్య కణాలు తగ్గుతాయి అన్న విషయంపై ఎలాంటి స్పష్టమైన ఆధారాలు (Clear evidence) లేనప్పటికీ, పురుషులు తమ మొబైల్ ను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచితేనే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే మొబైల్ ఫోన్లు విడుదల చేసే మైక్రోవేవ్ లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రభావం చూపుతాయి మరియు ఫోన్ వాడడం వల్ల వృషణాల (Testicles) ఉష్ణోగ్రతలు పెరుగుదలను కలిగిస్తాయా అనే అంశాలపై పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ మొబైల్ ను వీలైనంత వరకు తక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.