Central Government Loan: అగ్రిమాక్స్ ఫుడ్స్ LLP కంపెనీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక ఫుడ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కంపెనీ. నాణ్యమైన మెటీరియల్‌తో కూడిన సహజ పదార్ధాలను రైతుల నుండి నేరుగా తీసుకొని పదార్థాలను ఉత్పత్తి చేస్తారు. అయితే, ప్రస్తుతం ఇది మరో కొత్త బ్రాండ్ ను ప్రారంభించింది. ఇంతకీ ఆ బ్రాండ్ ఏంటి? ఏ పదార్దాలను ఉత్పత్తి చేస్తుంది? కేంద్రం అందించే సబ్సీడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బేక్ అండ్ కో బ్రాండ్
అగ్రిమాక్స్ ఫుడ్స్ LLP కంపెనీ కొత్తగా బేక్ అండ్ కో బ్రాండ్ ను ప్రారంభించింది. అయితే, ఈ బ్రాండ్ మిల్లెట్ ఆధారిత బేక్డ్ ఉత్పత్తులను విక్రయిస్తారు. ఆరోగ్యం, పోషకాహారం మరియు మంచి రుచిని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బేక్ అండ్ కో బ్రాండ్ కేంద్ర ప్రభుత్వ PMFME పథకం మద్దతుతో ప్రారంభించారు.
ఈ బ్రాండ్ ‘హెల్తీ స్నాకింగ్’ పై దృష్టి సారిస్తోంది. పోషకాలతో కూడిన పదార్దాలలో మిల్లెట్ బిస్కెట్లు, ఇండల్జెన్స్ కుకీలు, మిల్లెట్ కుక్కీలు, మిల్లెట్, వోట్స్, పండ్లు, గింజలు, బాదం మరియు సహజ బెల్లం వంటి ఆరోగ్యకరమైన పదార్దాలతో తయారుచేసే గ్లూటెన్-ఫ్రీ, షుగర్-ఫ్రీ మరియు ప్రిజర్వేటివ్-ఫ్రీ వంటి పదార్దాలను తయారు చేస్తారు.
అగ్రిమాక్స్ ఫుడ్స్ – హెల్తీ ఫుడ్స్
మరికొద్ధి రోజుల్లో , బేక్ అండ్ కో కంపెనీ అనేది సావరీస్, నామ్‌కీన్, అల్పాహార తృణధాన్యాలు, ఎనర్జీ కుక్కీలు, ప్రోటీన్-రిచ్ కుక్కీలు మరియు డయాబెటిక్-ఫ్రెండ్లీ కుకీలు వంటి మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను పెంచేందుకు దృష్టి సారిస్తుంది. భారతదేశం యొక్క మిల్లెట్ ఆధారిత ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్ 2022 నుండి 2032 వరకు 9.2% CAGR వద్ద అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు, ఈ బ్రాండ్ 2032 నాటికి $91.1 మిలియన్లకు అనగా రూ.759 కోట్లకు చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు.
కేంద్రం రూ.10 లక్షలు సబ్సీడీ
బేక్ అండ్ కో ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్‌లో మిల్లెట్ కుకీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ఏర్పాటుకు కేంద్రం రూ.10 లక్షల సబ్సిడీని అందించింది. స్థానిక ఆహార కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని అమలు చేయడమే ఇందుకు కారణం. అయితే, మీరు ఇలాంటిదే ఏదైనా ప్రారంభించాలనుకుంటే, కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన https://pmfme.mofpi.gov.in/pmfme/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కింద, కంపెనీకి కేంద్రం ఆర్థిక రాయితీలతో పాటు వివిధ మార్గాల్లో మద్దతును అందిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలు మరియు అవసరమైన యంత్రాలపై పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తుంది. అన్ని అంశాలలో స్థానిక అధికారులకు సహకరిస్తారు. ఈ కంపెనీ వల్ల ఎంతో మందికి మేలు చేకూరడంతో ఎటువంటి కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…