Central Job Notifications Release: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Comission) దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/డిపార్ట్‌మెంట్లలో 312 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ (Onlline) లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 13న ముగుస్తుంది . మరింత సమాచారం కోసం, అభ్యర్థులు https://upsc.gov.in/ని సందర్శించవచ్చు.
మొత్తం ఖాళీలు: 312
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్: 04 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్: 67 పోస్టులు.
సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 04 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (Specialist Grade3 Assistant Professor) : 132 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III (Specialist Grade3) : 35 పోస్ట్‌లు
డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్: 09 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్: 04 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ II: 46 పోస్టులు
ఇంజనీర్ మరియు షిప్ సర్వేయర్ కమ్-డిప్యూటీ డైరెక్టర్ జనరల్: 2 స్థానాలు.
ట్రైనింగ్ ఆఫీసర్: 08 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 1 పోస్ట్
అర్హత, దరఖాస్తు రుసుము వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య: 312.
అర్హత : ఇచ్చిన పోస్టుల ఆధారంగా వాటి విభాగాల్లో డిప్లొమా (Diploma) , డిగ్రీ, PG, లేదా PG డిప్లొమా చేసి ఉండాలి, అలాగే పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము రూ. 25. SC/ST/మహిళలు మరియు వికలాంగ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు గడువు : జూన్ 13, 2024.